రాజమౌళి సినిమా అంటేనే అదో రేంజ్ ప్రేక్షకలకు ఊహలకు అందకుండా ప్రేక్షకుడును ఆశ్చర్య పరిచే మేకింగ్ తో సినిమా ను తీస్తాడు. బాహుబలితో జాతీయ డైరెక్టర్ గా మారిపోయిన రాజమౌళి తరువాత సినిమా మీద దృష్టి పెట్టినాడు.సినిమా ఎంతకాలం తీస్తారో? దాదాపు అంత కాకపోయినా, అందులో పావు వంతుకాలమైనా బ్యాక్ గ్రవుండ్ వర్క్ వుంటుంది. కథ లైన్ అనుకున్న తరువాత ఫ్యామిలీ మెంబర్లు, తనకు నచ్చిన టెక్నీషియన్లు, ఇతరులతో కలిపి నిత్యం స్టోరీ సిట్టింగ్ లు జరుగుతూనే వుంటాయి.

Image result for rajamouli

అవన్నీ కొలిక్కి వచ్చిన తరువాత ఇక ఆర్టిస్టులు, స్టోరీ బోర్డులు అదో పెద్ద కార్యక్రమం. ఇదంతా అయిన తరువాత స్టార్ కాస్టింగ్. రాజమౌళి తాజా సినిమా వ్యవహారం ఇక్కడే వుంది. బోలెడు మంది జూనియర్ ఆర్టిస్టులను 'రిక్రూట్' చేసుకునే కార్యక్రమం జరుగుతోందట. జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్స్ ద్వారా, తెలుసున్న వారి ద్వారా జనాల్లోకి స్మూత్ గా మెసేజ్ పంపి, బోలెడు మందిని ఈ మధ్య రప్పించారట. వాళ్లకు టెస్ట్ లు, పలకరింపులు, ఇతరత్రా వ్యవహారాలన్నీ రాజమౌళి టీమ్ నిర్వహించింది. నిర్వహిస్తోంది.

Image result for rajamouli multistarrer

వీళ్లంతా సినిమాలో కనిపించే వివిధ రకాల చోటా, మోటా పాత్రల కోసం. వీళ్ల రిక్రూట్ మెంట్ అయిన తరువాత వీళ్లందరికీ రిహార్స్ లు, ట్రయినింగ్ వుంటుందట. అప్పుడు అసలు కథ, హీరోలు ఇద్దరికీ, మిగిలిన మేజర్ స్టార్ కాస్ట్ కు కూడా రిహార్సల్, కాస్త ట్రయినింగ్ వుంటుందట. ఈ విషయాన్ని ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్-చరణ్ కు చెప్పేసాడని, నెలరోజులు ఇందుకోసమే కావాలని క్లారిటీ ఇచ్చేసాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: