ఈరోజు తెల్లవారుఝామున నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురి కావడం.. కారులోంచి నందమూరి హరికృష్ణ రోడ్డు మీద పడటంతో తలకు, చాతి భాగంలో గాయాలు తగలడం జరిగింది. వెంటనే నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే తలకు పెద్ద దెబ్బే తగలడం వల్ల హరికృష్ణ స్ప్రుహ కోల్పోయారు.  


హైదరాబాద్ నుండి నెల్లూరు కావలి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. నల్గొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే కారు డివైడర్ ను ఎక్కి పల్టీలు కొట్టిందని తెలుస్తుంది. హాస్పిటల్ కు తీసుకెళ్లిన కొద్దిసేపటికే హరికృష్ణ మరణ వార్త వినాల్సి వచ్చింది.


ఇక మరో పక్క నందమూరి ఫ్యామిలీకి ఈ రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయని చెప్పొచ్చు. హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రాం కూడా నల్గొండ దగ్గరే రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇక 2009లో ఎన్.టి.ఆర్ కు నల్గొండ టూ ఖమ్మం రహదారిలో గల మోతే దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఎన్.టి.ఆర్ ఎలానో ఆ ప్రమాదం నుండి బయట పడ్డారు. 


కాని అప్పుడు జానకి రాం, ఇప్పుడు హరికృష్ణ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హరికృష్ణ మృతి పట్ల నందమూరి అభిమానుల్లో కూడా విషాద చాయలు అలముకున్నాయి. తండ్రి మరణ వార్త విని ఎన్.టి.ఆర్, కల్యాణ్ రాం ఇద్దరు హాస్పిటల్ కు బయలు దేరినట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: