‘అజ్ఞాతవాసి’ తరువాత రాజకీయాల బాటపట్టిన పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలలో ఎప్పుడు నటిస్తాడో అతడికే తెలియని విషయం. పవర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానులను పొందిన పవన్ సినిమాలకు దూరం కావడం పవన్ అభిమానులకు ఏమాత్రం నచ్చకపోయినా పవన్ ఉద్దేశ్యాలతో రాజీపడి కొనసాగుతున్న పరిస్థితి.
Pawan in Sye Raa Sets
ఇలాంటి పరిస్థుతులలో గత రెండురోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఒక ఫోటో వెనుక చరణ్ వ్యూహం ఉంది అని వార్తలు వస్తున్నాయి. “సైరా” సెట్స్ లో ఉన్న చిరంజీవి అమితాబ్ రామ్ చరణ్ లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్న ఈఫోటో పవన్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అవుతోంది. 
దస్త్రం:Satyanand.jpg

చాలరోజుల క్రితం పవన్ తన గెడ్డం పెంచక ముందు గెడ్డం లేకుండా క్లీన్ షేవ్ లుక్ తో పవన్ కనిపిస్తున్న ఈఫోటోను సినీ రచయిత సత్యానంద్ తన ఫేస్ బుక్ ద్వారా బయట పెట్టడంతో ఇప్పుడు ఆఫోటో మెగా అభిమానులకు ముఖ్యంగా పవన్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. పవన్ చిరంజీవిలు తరుచూ కలుస్తూ ఉంటారని రాబోతున్న రోజుల్లో ఈమెగా బ్రదర్స్ ఇద్దరూ చాలా ఎక్కువగా ఇలాగే కలుస్తూ ఉంటారని సంకేతాలు ఇవ్వడానికి చరణ్ ఈఫోటోను సత్యానంద్ ద్వారా బయటపెట్టాడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. 
 Jana Sena
‘జనసేన’ రాజకీయ ప్రయోజనాల రీత్యా మెగా అభిమానులను ఒకటి చేసిందుకు చేసే ప్రయత్నాలలో భాగమే ఈఫోటోల లీక్ అని అంటున్నారు. చిరంజీవి పవన్ ల సాన్నిహిత్యంతో పాటు మెగా కుటుంబం అంతా పవన్ వెనకే ఉంది అని సంకేతాలు ఇవ్వడానికి ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయ్యుందని ఈయాక్షన్ ప్లాన్ ను ఇంకా అమలు చేయడమే మిగిలి ఉందని అంటున్నారు. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ సందర్భంలో అభిమానులను సరిగా వినియోగించుకోలేని మెగా ఫ్యామిలీ ‘జనసేన’ కు ఆలోటు లేకుండా చేసే ప్రక్రియలో భాగంగా ఎప్పుడో పవన్ ‘సైరా’ షూటింగ్ స్పాట్ కు వచ్చిన ఫోటోను ఇప్పుడు లీక్ చేయడం అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: