ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి హరికృష్ణ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఫిలిం ఇండస్ట్రీతో పాటు తెలుగు దేశం పార్టీ వర్గాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి. 1982లో ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ చైతన్యరధానికి సారధిగా ఒక మామూలు వ్యక్తిగా ఎన్టీఆర్ చైతన్య రధాన్ని నెలల తరబడి జనం మధ్య తిప్పుతూ ఎన్టీఆర్ కు నిజమైన వారసుడుగా హరికృష్ణ మారుతాడా అన్న అభిప్రాయాలను అప్పట్లో కలిగించాడు హరికృష్ణ.
 అసలు ప్రమాదం ఎలా
ఎన్టీఆర్ చైతన్య రధం పై పర్యటన చేస్తున్నప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ బాగోగులు చూసుకోవడమే కాకుండా ‘ఎన్టీఆర్ చెప్పులకు అంటిన మట్టిని’ కూడ కడిగి ఎన్టీఆర్ కోసం ఎంతో కష్టపడ్డ హరికృష్ణ ఎన్టీఆర్ రాజకీయ వారసుడుగా ఎదగ లేకపోయాడు అన్నది వాస్తవం. 1995లో ఎన్టీఆర్ పై చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసినప్పుడు హరికృష్ణ సహాయ సహకారాలు లేకుంటే ఆనాడు విశేష ఆదరణతో కొనసాగుతున్న ఎన్టీఆర్ ను పదవి నుంచి దింపడం సాధ్యమయ్యే పని కాదు అని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. 
కామినేని ఆసుపత్రి వద్ద
ఆతరువాత రాజకీయ పరిణామాలలో చంద్రబాబు క్యాబినేట్ లో హరికృష్ణ మంత్రిగా చేరినా ఆతరువాత చంద్రబాబుతో వచ్చిన అభిప్రాయ భేధాలతో తన పదవిని వదులుకోవలసిన పరిస్థితి ఏర్పండింది. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక శక్తిగా ఎదుకుతాడు అని భావించిన హరికృష్ణ చివరకు గత 2014 ఎన్నికలలో ఎమ్.ఎల్.ఏ గా పోటీ చేయాలని ప్రయత్నించినా ఆఖరికి ఈమధ్య తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అవ్వాలని ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో రాజకీయంగా హరికృష్ణ ఏస్థాయిలో ఓడిపోయాడో అందరికి అర్ధం అవుతుంది. 
  స్పందించిన నల్గొండ ఎస్పీ   
ఇక నటుడుగా ఎన్టీఆర్ నట వారసుడుగా రాణించాలని 1967లో ‘శ్రీ కృష్ణావతారం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించినా ‘సీతారామరాజు’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘శివరామరాజు’ ‘సీతయ్య’ ‘టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌’ ‘స్వామి’ తదితర సినిమాలలో నటుడుగా నటించి మెప్పించగలిగాడు కానీ హరికృష్ణ కలలు కన్న మాస్ హీరో స్థాయికి ఎదగ లేకపోయాడు. తన ఆశలు అన్నీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లలో చూసుకుంటూ రాజకీయాలకు దూరంగా ప్రస్తుతం కొనసాగుతున్న సమయంలో విధిరాత ప్రమాద రూపంలోవచ్చి కేవలం 61 సంవత్సరాలకే హరికృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం దురదృష్టకరం..  


మరింత సమాచారం తెలుసుకోండి: