శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే కృష్ణాష్టమి జరుపుకుంటారు. శ్రావణ మాసం బహుళ పక్షంలో రోహిణితో కూడిన అష్టమి నక్షత్రం నాడు కృష్ణుడు జన్మించాడు. రోహిని నక్షత్రం ఇదే రోజు కొద్దిసేపు చాంద్రాయుక్తమై ఉండటం వల్ల అందుకే శ్రావణ కృష్ణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి అంటారు.   


కృష్ణుడు జన్మదినం కాబట్టి జన్మాష్టమి అంటారు. అంతేకాదు గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణాష్టమిని కొందరు తిథి ప్రాముఖ్యత ఇస్తే.. మరి కొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు కృష్ణుడికి పూజా చేస్తే అంతా మంచే జరుగుతుంది.   


కృష్ణాష్టమి రోజు సూర్యోదయం ముందే లేచి తలస్నానం చేయాలి. పసుపు రంగు బట్టలను ధరించి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కృష్ణుడికి పూజ చేసి ఆరోజు ఉపవాసం ఉంటే అలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుందట. ఇక ఈరోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర పూజలు జరపడం వల్ల వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుతాయట.



మరింత సమాచారం తెలుసుకోండి: