బిగ్ బాస్ లో వారం వారం టాస్కులు కంటెస్టంట్స్ తో పాటుగా ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. ముఖ్యంగా సీజన్ ఎండింగ్ అవుతున్న ఈ సందర్భంలో వచ్చే టాస్కులు మరింత పకడ్బందీగా చేస్తున్నారు. ఈ వారం లక్సరీ బడ్జెట్ టాస్కులో భాగంగా మర్డరర్, డిక్టెక్టివ్, పోలీస్, కామన్ మెన్ ఇలా ఇంటి సభ్యులను విడదీసి ఇంట్లో జరిగే మర్డర్ లను చేసేదెవరో డిటెక్టివ్, పోలీస్ కనిపెట్టాల్సి ఉంటుంది.


టాస్కులో మర్డరర్ గా గీతా చేస్తున్నా ఆమె ఎవరికి తెలియకుండా సైలెంట్ గా బిగ్ బాస్ అప్పచెప్పిన అన్ని టాస్కులు చేస్తూ వచ్చారు. ఫైనల్ గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులన్ని కంప్లీట్ చేయడం వల్ల గీతకి ఈ సీజన్ మొత్తం ఒకరిని ప్రతివారం నామినేట్ చేసే రైట్ ఇచ్చారు. ఇక రేపు జరుగబోయే ఎపిసోడ్ లో గీత సీజన్ మొత్తం కౌశల్ ను ఎలిమినేట్ చేసేందుకు ఓకే చెబుతుంది.


గడచిన పది వారాల్లో బిగ్ బాస్ ఈ రెండు రోజుల్లో ఆడియెన్స్ లో మంచి క్యూరియాసిటీ నింపేలా చేసింది. గీత మర్డరర్ అయినా పోలీస్ అయిన రోల్ రైడా, డిటెక్టివ్ అయిన గణేష్ కనిపెట్టలేకపోయారు. ఫైనల్ గా గీత టాస్కు ఒక్కతే విజయం సాధించి తనతో ఎప్పుడూ దెబ్బలాడే కౌశల్ ను సీజన్ మొత్తం నామినేట్ అయ్యేలా చేసింది.


అయితే కౌశల్ ఇలా నామినేట్ అయినా సరే పర్వాలేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ మొత్తంలో ఈమాత్రం ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ అందుకుంటుంది అంటే అది కేవలం కౌశల్ వల్లే అని చెప్పొచ్చు. కౌశల్ సపోర్టర్స్ అంతా కౌశల్ ఆర్మీగా మారి తనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఎండింగ్ కు వచ్చేస్తున్నా కొద్ది మరింత రసవత్తరంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: