పవన్ కళ్యాణ్ వీరాభిమానులలాగే విజయ్ దేవరకొండ అభిమానులు కూడ మారిపోతూ  ప్రతి చిన్నవిషయం పైనా విపరీతంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ అభిమానుల టార్గెట్ లో నాగశౌర్య వచ్చి చేరాడు. ఈరోజు విడుదల అవుతున్న ‘నర్తనశాల’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య చేసిన కామెంట్స్ విజయ్ దేవరకొండ అభిమానులకు తీవ్రఅసహనాన్ని కలిగిస్తున్నాయి.

స్టార్ డమ్ మీద స్టార్ స్టేటస్ మీద ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగశౌర్య ఇచ్చిన సమాధానం విజయ్ దేవరకొండ అభిమానులకు తీవ్రఅసహనాన్ని కలిగిస్తోంది. నాగశౌర్య విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకుండా స్టార్స్ అంటే ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లు మాత్రమే అన్నట్లు చెప్పడమే కాకుండా ఒకరోజు ఒకస్టార్ లా నిద్రలేవాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ని తాను కోరుకుంటానని కామెంట్ చేయడం బట్టి విజయ్ దేవరకొండ స్టార్ కాదు అన్నఅర్ధాలు నాగాశౌర్య మాటలలో వస్తున్నాయని విజయ్ అభిమానుల వితండ వాదన. 
The young acting sensation has already started promotions of his upcoming film Taxiwala which is releasing on May 18.
చిరంజీవి అల్లు అరవింద్ దిల్ రాజు లాంటి వాళ్ళు విజయ్ దేవరకొండ స్టార్ లీగ్ లో చేర్చిన నేపధ్యంలో విజయ్ పేరును కూడ కనీసం నాగశౌర్య ప్రస్తావించక పోవడం విజయ్ అభిమానుల ఆగ్రహానికి మూల కారణంగా మారింది. దీనితో నాగశౌర్యను టార్గెట్ చేస్తూ విజయ్ అభిమానులు నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా చేస్తున్నారు. 

ఇప్పటికే ఈరోజు విడుదల అవుతున్న ‘@నర్తనశాల’ మూవీకి ఒకనెగిటివ్ సెంటిమెంట్ ఉండటంతో ‘నర్తనశాల’ అన్నటైటిల్ కు బదులుగా ‘@నర్తనశాల’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసానని స్వయంగా నాగశౌర్య చెప్పిన విషయం తెలిసిందే. గతంలో ‘నర్తనశాల’ టైటిల్ తో బాలకృష్ణ ప్రారంభించిన పౌరాణిక సినిమా సౌందర్య మరణించడంతో ఆగిన నేపధ్యంలో తన ‘నర్తనశాల’ కు ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ పడకూడదని ఇలా ‘@నర్తనశాల’ గా మార్చాను అంటున్నాడు నాగసౌర్య. ఈసెంటిమెంట్ తో పాటు విజయ్ అభిమానుల ఆగ్రహం ఈమూవీ పై ఎలాంటి ఫలితాన్ని చూపెడుతుందో ఈరోజు రిజల్ట్ వచ్చేస్తుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: