సినీ ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో గానీ వారసత్వం ఎక్కువగా ఉంటుంది. అయితే వారసత్వం ఉన్నా కొంత మందికి కలిసి రాక సక్సెస్ కాలేక పోయారు.  చాలామంది సినిమా ప్రముఖులు వారి వారి సంతానాన్ని సినిమాల్లోకి తేవాలని అనుకున్నా, పెద్ద కొడుకులు అందరూ పైకి రావడంలో విఫలం కావడం, చిన్న కొడుకులు సక్సెస్ కొట్టడం విశేషం. ఎన్టీఆర్ హరికృష్ణను నటుడిని చేయాలనుకున్నారు. చిన్నప్పుడు, పెద్దయ్యాక కూడా ఆయన ఎంకరేజ్ చేసారు. హరికృష్ణ చాలా సినిమాలే చేసారు కానీ బాలకృష్ణ రేంజ్ హీరో కాలేకపోయారు.

Image result for ntr

హీరో కృష్ణ కూడా పెద్ద కొడుకును హీరోగా నిలబెట్టాలనుకున్నారు. కానీ విఫలమయ్యారు. ఇవివి సత్యనారాయణ ఇదే ప్రయత్నం చేసారు. కానీ రెండో కొడుకు అల్లరి నరేష్ నే నిలబడగలిగారు. నటుడు గిరిబాబు తన పెద్ద కొడుకును హీరోగా పెట్టి సినిమా తీసారు కానీ చిన్న కొడుకు రఘుబాబుతో కాదు. కానీ పెద్దకొడుకు బోసు బాబు ఒక్కసినిమాతో ఆగిపోయారు. రఘుబాబు మంచి నటుడు అనిపించుకున్నాడు.

Image result for venkatesh

ఎఎన్నార్ తన పెద్దకొడుకు వెంకట్ ను నిర్మాతను చేయగలిగారు. రెండో కొడుకు నాగ్ మాత్రమే హీరో అయ్యారు. వెంకట్ ఆ తరువాత తరువాత నిర్మాతగా కూడా వుండలేకపోయారు. అల్లు అరవింద్ పెద్దకొడుకు సినిమాల్లోకి రాలేదు. చిన్న కొడుకు బన్నీ మాత్రమే పైకి వచ్చారు. హరికృష్ణ పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్ కన్నా, చిన్న కొడుకు ఎన్టీఆర్ నే బడా స్టార్ అనిపించుకున్నారు. రామానాయుడు కూడా రెండో కొడుకు వెంకటేష్ నే హీరోను చేయగలిగారు. హీరో రానా ఒక్కడికే ఈ సెంటిమెంట్ లో మినహాయింపు లభించింది అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: