నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ మరణం ఇచ్చిన షాక్ నుండి కేవలం తెలుగుదేశ పార్టీ వర్గాలు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా మన తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు సైతం హరికృష్ణ మరణం షాక్ నుండి ఇంకా తేరుకోలేక పోతున్నారు. ఎందరో ప్రముఖులు హరికృష్ణతో తమకు ఉన్న సాన్నిహిత్యం గురించి అనేక విషయాలను షేర్ చేస్తూ ఉంటే హరికృష్ణకు సంబంధించిన తీరని కోరిక ఇప్పుడు బయటకు వచ్చింది.
నెల్లూరు జిల్లాలో
అక్కినేని కుటుంబ చిత్రంగా ‘మనం’ విడుదలై ఘన విజయం సాధించిన తరువాత హరికృష్ణకు కలిగిన ఆలోచన ఇది. నందమూరి ఫ్యామిలీ మూవీగా ఒక సినిమాను తాను నటిస్తూ జూనియర్ కళ్యాణ్ రామ్ లతో కలిసి ఒక మల్టీ స్టారర్ గా తీయాలని చేసిన ప్రయత్నాలకు సంబంధించిన విషయం. 
Hari Krishna (Telgu Actor) Photos
తన తండ్రి హరికృష్ణ ఆలోచనలు పసికట్టిన కళ్యాణ్ రామ్ ఈమల్టీ స్టారర్ కథ కోసం ఒక ప్రత్యేకమైన రైటర్స్ టీమ్ ను ఏర్పాటు చేయడమే కాకుండా దీనికి సంబంధించి కొన్ని స్టోరీ లైన్స్ ను కూడా సెట్ చేయించినట్లు టాక్. ఒక కథలో హరికృష్ణ తాతగా జూనియర్ కళ్యాణ్ రామ్ లు మనవలుగా ఉండే పాత్రలకు సంబంధించిన కథను ఎంపిక చేయడం జరిగినా రకరకాల కారణాలతో ఆకథ షూటింగ్ దశ వరకు చేరుకోలేదు. 
హరికృష్ణ వెళ్లింది..
హరికృష్ణ ఈ మల్టీ స్టారర్ వాస్తవ రూపం దాల్చకపోవడానికి ప్రధాన కారణం జూనియర్ తన నిర్ణయాలు చెప్పడంలో చేసిన ఆలస్యం అన్న వార్తలు కూడ ఉన్నాయి. కారణాలు ఏమైనా ఈమల్టీ స్టారర్ రూపు దిద్దుకోకపోవడం హరికృష్ణకు తీరని కోరిక అని అతని సన్నిహితులు అంటూ ఉంటారు. హరికృష్ణ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకి దూరం అయిపోయినా కనీసం కళ్యాణ్ రామ్ కోరికను గ్రహించి రానున్న కాలంలో కళ్యాణ్ రామ్ జూనియర్ల కలయికతో ఒక మల్టీ స్టారర్ తీయగలిగితే ఆవిధంగా అయినా హరికృష్ణ తీరని కోరిక కొంత వరకు తీరుతుందేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: