‘అరవింద సమేత’ మూవీని నిర్మాత తన హారికా హాసినీ ప్రొడక్షన్ బ్యానర్ పై రాథా కృష్ణ నిర్మిస్తూ ఉన్నా ఈమూవీ వెనుక కర్త కర్మ క్రియ అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు త్రివిక్రమ్. ఇక ఈమూవీ విడుదలకు సంబంధించిన ప్రమోషన్స్ వచ్చేనెల సెప్టెంబర్ నుండి ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఈమూవీకి విజయానికి ఎటువంటి వాస్తు అడ్డంకులు ఏర్పడకుండా త్రివిక్రమ్ తన సన్నిహితుడు రాథా కృష్ణ చేత చేయించినట్లు వార్తలు వస్తున్నాయి.
NTR
ప్రస్తుతం హారికా హాసినీ ప్రొడక్షన్ ఆఫీసు బంజారాహిల్స్ లోని గ్రీన్ వేలీలో ఉన్న విషయం ఇండస్ట్రీ వర్గాలకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇదే ఆఫీసు నుండి ‘అజ్ఞాతవాసి’ బిజినెస్ జరిగినా ‘అజ్ఞాతవాసి’ ఘోరమైన ఫ్లాప్ అనుభవాలు త్రివిక్రమ్ రాథా కృష్ణలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. 

దీనితో మళ్ళీ అటువంటి పరిస్థుతులు ‘అరవింద సమేత’ విషయంలో ఎదురు కాకూడదని త్రివిక్రమ్ సూచనలతో ఒక జ్యోతిష్కుడు సలహామేరకు హారికా హాసినీ సంస్థ అదే ప్రాంతంలోని సాగర్ సొసైటీకి సంబంధించిన ఒక ఖరీదైన బిల్డింగ్ ను నెలకు 3 లక్షల అద్దెకు తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. మూడు అంతస్తులతో ఉన్న ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈసినిమా యూనిట్ కు సంబంధించిన వ్యక్తులు తమ కార్య కలాపాలు కొనసాగిస్తూ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఈసినిమాకు సంబంధించి కీలక వ్యక్తులు అయిన రాథా కృష్ణ త్రివిక్రమ్ లకు వేరువేరు ఆఫీసులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Aravindha Sametha Teaser
‘అరవింద సమేత’ మూవీకి ప్రస్తుతం బయ్యర్ల నుండి భారీ ఆఫర్స్ వస్తున్న నేపధ్యంలో ఈమూవీకి బిజినెస్ పరంగా ఎటువంటి సమస్యలు లేకపోయినా ఈమూవీ విజయం త్రివిక్రమ్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. ఈమూవీ తరువాత జూనియర్ నటించే సినిమా మరో రెండు సంవత్సరాల వరకు ఉందని నేపధ్యంలో ఈమూవీ ఎట్టి  పరిస్తుతులలోను హిట్ అవ్వాలి అని జూనియర్ త్రివిక్రమ్ కు కండిషన్స్ పెడుతున్నట్లు టాక్. ఇలాంటి టెన్షన్స్ మధ్య ఈవాస్తు మార్పులు ఎంతవరకు విజయాన్ని తెచ్చిపెడతాయో రానున్న రోజులలో తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: