బాహుబలిలో అత్యద్భుత నటన ప్రదర్శించి విశ్వవిఖ్యాతమైన టాలీవుడ్ కథానాయకుడు ప్రభాస్ మరో విఖ్యాతం కానున్న బాలీవుడ్ అవకాశం వచ్చింది. అదీ భారత్ లోనే అత్యంత అధిక ₹1000 కోట్లకు మించిన బడ్జెట్ తో రిలయన్స్ గ్రూప్ మరో అద్భుత బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్ తో సంయుక్తంగా నిర్మించబోయే "మహాభారత్"

Related image

బాహుబలి తరవాత రావలసి ఉన్న 'సాహో' ఇంకా ఆలశ్యమౌతున్న దరిమిలా ప్రజల్లో ప్రభాస్ సినిమా పట్ల ఆతృత, ఆశక్తి, ఆసక్తి, నిరీక్షణ నిరంతరం ఇంతింతై వటుఇంతై లాగా దిన దిన ప్రవర్ధమానం ఔతుంది. అయితే బాలీవుడ్ ప్రేక్షకులను మనోరంజకంగా అలరించి భారత్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా బాహుబలి.  బాహుబలి తో  ప్రభాస్ అంటే, ఆసేతు శీతాచలం (కాశ్మీర్ నుంచి కన్యాకుమారి) ఫాన్ ఫాలోయింగ్ వెల్లువై ఉధృతంగా రిగిపోయింది. అందుకే "ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రి సినిమా" కోసం భారత్ ఎదురుచూస్తుందనే చెప్పొచ్చు.

Image result for prabhas as in arjuna in mahabharat

ఈ సమయంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ భారత పంచమవేదం అనదగ్గ ఐతిహాసం "మహాభారత్" ను "గ్రాండ్ ఫీస్ట్ ఆన్ సిల్వర్ స్క్రీన్" గా  ఆవిష్కరించాలని అనుకున్నాడు.  కాని  భారతీయుల హృదయాంతరాళాల్లో శత సహస్రాబ్ధాలుగా ముద్రించుకుని పంచమవేదంగా ప్రసిద్ధిగాంచిన "మహాభారత్" నిర్మాణంలో ఆయనకు అనేక సమస్యలు, అవరోధాలు, ఇబ్బందులు  దొంతరలుగా  మనోఫలకంపై  గోచరమయ్యాయి.

Image result for prabhas as in arjuna in mahabharat

"పద్మవత్" సినిమా నిర్మాణ సందర్భంగా సంజయ్ లీలా బన్సాలి పడ్ద అవస్థలు గుర్తుకురావటంలో ఆ ఆలోచన ను  అప్పటికి వాయిదావేశాడు. అయితే ముఖేష్ అంబాని మార్గదర్శకత్వం సారధ్య నేతృత్వంలోని ప్రఖ్యాత రిలయన్స్ గ్రూప్ కూడా చేతులు కలపటానికి సన్నద్ధమవటంతో మహాభారత్ ను " గ్రాండ్ ఫీస్ట్" గా నిర్మించటానికి లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేం ఆఫ్ ది థార్న్స్ లాంటి హాలీవుడ్ చిత్రాల నిర్మాణ స్థాయిలో, అత్యద్భుత సాంకేతిక సాహిత్య విలువలతో నిర్మించటానికి తెరవెనుక హోంవర్క్ తో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Image result for aamir khan mahabharat

అయితే ఈ భారీ చిత్రానికి నటీ నటవర్గాన్ని ఎంపిక చేయటం మహోత్కృష్ట ఘట్టం. ఏమంత సులభం కాదు. దేశం ప్రేమించే ఇతిహాసం కాబట్టి నటీనటుల ఎంపిక భారత్ లోని అన్నీ చిత్రరంగాల నుండి జరగవచ్చు. మహాభారత్ కథానాయకులు యోగీశ్వర్ శ్రీకృష్ణ పాత్రలో నటించటానికి అమీర్ ఖాన్ నిర్ణయం కాగా, ధనుంజయుడు, వీర విక్రమ పరాక్రమ అర్జున పాత్రలో బాహుబలి ప్రభాస్ మాత్రమే ప్రేక్షక జనావళిని మెప్పించగలడని విశ్వాసంతో ఆయన కోసం ప్రయత్నిస్తున్న ట్లు బాలీవుడ్ సమాచారం.

Image result for reliance production mahabharat a grand feast

గ్లోబల్ ఆడియన్స్ ను అలరించటానికి అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన రచయితలు స్క్రీన్-ప్లే & స్క్రిప్ట్ నిపుణుల సారధ్యంలో స్క్రిప్ట్ తయారు చేయనున్నట్లు తెలుస్తుంది. స్వయంగా అమీర్ ఖాన్ ప్రభాస్ కు తన పాత్ర గుఱించి వివరిస్తూ, అందులోని కీలాంశాలను విశదీకరిస్తూ అంగీకరింపజేసే ప్రయత్నాలు మొదలెట్టినట్లు బాలీవుడ్ సమాచారం. ఇక ప్రభాస్ అంగీకారం తెలిపితే ప్రభాస్ బాలీవుడ్ ప్రవేశం జరిగినట్లే.

Image result for aamir khan as srikrishna

అదే జరిగితే వెండితెరపై ఒకే ఫ్రేం లో అమీర్ -ప్రభాస్ కాంబినేషన్ ప్రేక్షక హృదయాలను రంజింపజేయటం గ్యారెంటీ. వీరికి అదనం ద్రౌపది పాత్రలో దీపికా పదుకోన్ కూడా ఎంపికైందనే అంటున్నారు. ఈ ముగ్గురిని కలయిక ఈ సినిమాని దృశ్యాల సమాహారం - వీనుల విందు చేయటం ఖాయం. ఒక్కసారి ప్రభాస్ అంగీకారం జరిగితే జెట్-స్పీడ్ లో ప్రణాళికా బద్ధంగా ఈ మాగ్నం ఒపస్ గా నః భూతో-నః భవిష్యతి గా తెర కెక్కి ప్రేక్షక హృదయాలపై పాంచజన్య శంఖారావంతో సమ్మోహనాస్త్రం వేయటం ష్యూర్.  

Image result for prabhas in and as arjuna of mahabharat role

ప్రతిష్టాత్మక అమీర్ ఖాన్స్ :థగ్స్ ఆఫ్ హిందుస్థాన్: నవంబర్లో విడుదలైన వెంటనే,  "మహాభారత్" నిర్మాణం ఒక మహాయజ్ఞంగా ప్రారంభమవటానికి సన్నాహాలు మొదలవనున్నాయి. నాలుగు నుంచి ఐదు భాగాలు గా ఈ సినిమా నిర్మితమవుతుందని తెలుస్తోంది. అత్యంత ప్రఖ్యాంతి గాంచిన ప్రపంచ స్థాయి దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు అనేకులు ఈ సినిమాకు పని చేసే అవకాశం ఉందని సమాచారం. అత్యధికులు మాట్లాడే ప్ర‌పంచ భాష‌లన్నింటిలోనూ ఈ దృశ్య కావ్యాన్ని విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం అందుతోంది. ఈ సినిమా కోసం అమీర్‌ ఖాన్‌ ఎక్కువగా కృషి చేస్తున్నారు. 

Image result for deepika padukone as draupadi in aamir mahabharat

మరింత సమాచారం తెలుసుకోండి: