నిన్న చనిపోయిన హరికృష్ణ మరణానికి సంబంధించిన వార్తలతో మీడియా హోరెత్తి పోతున్న నేపధ్యంలో సాధారణ సినిమా ప్రేక్షకులు ఈరోజు విడుదలైన ‘@నర్తనశాల’ గురించి కనీస స్థాయిలో కూడ పట్టించు కోలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ‘ఛలో’ సినిమాతో హీరోగానే కాక నిర్మాతగా కూడా సక్సస్ అందుకున్న నాగశౌర్య తన  రెండవ సినిమాగా ‘@నర్తనశాల’ ను ఈరోజు భారీ స్థాయిలో విడుదల చేయడమే కాకుండా ఆ మూవీకి భారీ స్థాయిలో పబ్లిసిటీ కూడ చేసాడు.   
Naga Shaurya's Narthanasala Release In August 30
ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో పాటు ఈ ఈమూవీకి పోటీగా విడుదల అవుతుంది అనుకున్న ‘శైలజా రెడ్డి’ వాయిదా పడటంతో ఈమూవీ తనకు అన్నివిధాలా కలిసి వస్తుందని నాగశౌర్య భావించాడు. అయితే ఈరోజు ఉదయం ఈమూవీ ప్రదర్శింపబడే థియేటర్స్ వద్ద తక్కువగా జనం జనం కనిపించడంతో ఇది అంతా హరికృష్ణ మరణ ప్రభావమా అంటూ కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Narthanasala 2018 Review
అయితే దీనికితోడు ఈమూవీని సుమారు 14oస్క్రీన్స్ లో ఓవర్సీస్ లో విడుదల చేసినా ఈమూవీకి వచ్చిన ఓవర్సీస్ టాక్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ మౌత్ టాక్ తో నిలదోక్కుకుని నిలబడుతుంది అని భావిస్తే ఆ ఆశ కూడ కనిపించడం లేదు అని టాక్. ముఖ్యంగా కామెడీ కోసం నాగశౌర్య  చేసిన ప్రయత్నాలు మాత్రమే తెరపై కనపడ్డాయి కానీ ఈమూవీని చూసిన ప్రేక్షకులకు ఏమాత్రం నవ్వు తెప్పించ లేకపోయాయి అని తెలుస్తోంది.  
actor naga shourya overconfidence on narathanasala movie
ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు రివీల్ అయిన ‘గే’ ట్విస్ట్ అయినా ఈ సినిమాను  ఆదుకుంటుంది అని భావిస్తే ఆ ఆశ కూడ నీరుకారిపోయినట్లు ప్రాధమీక వార్తలు వస్తున్నాయి. హాస్యానికి మంచి స్కోప్ ఉన్న ఈమూవీని బాగా మలచడంలో  దర్శకుడిగా శ్రీనివాస్ చక్రవర్తి పూర్తి వైఫల్యం చెందడంతో ఈసినిమాకు ఏవరేజ్ హిట్ వచ్చినా అదృష్టమే అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: