నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో ప్రముఖ నటులు నందమూరి హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే.  ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బౌతిక ఖాయాన్ని దర్శించుకుని నివాళులు అర్పించారు.  ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులకు నందమూరి హరికృష్ణ లేని లోటు తీర్చలేనిదని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 
Image result for హరికృష్ణ అంతిమయాత్ర
తాజాగా నందమూరి హరికృష్ణ చనిపోవడంపై నటి భూమిక చావ్లా స్పందించింది. హరికృష్ణ ప్రమాదంలో చనిపోయినట్లు తెలియగానే తాను షాక్ కు గురిఅయ్యానని తెలిపింది.  జూ.ఎన్టీఆర్ తండ్రిగారిగా మాత్రమే హరికృష్ణ తనకు తెలుసనీ, ఆయన్ను ఏనాడూ కలుసుకోలేదని వెల్లడించింది.  భూమిక తన ట్విట్టర్ లో ఈ విధంగా పోస్ట్ చేసింది...‘జూ.ఎన్టీఆర్ నాన్నగారు సడెన్ గా చనిపోయారని తెలియగానే నిజంగా షాక్ కు గురయ్యా.
Image result for హరికృష్ణ అంతిమయాత్ర ఎన్టీఆర్
హరికృష్ణ గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. కానీ ఎన్టీఆర్ ఎంత బాధ అనుభవిస్తున్నాడో నేను అర్ధం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా ఇటీవలే మా అమ్మను కోల్పోయాను. నందమూరి కుటుంబానికి దేవుడు ఈ బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలి’. కాగా, రాజమౌళి దర్శకత్వంలో  భూమిక ఎన్టీఆర్ తో కలసి సింహాద్రి, సాంబా చిత్రాల్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: