తెలుగు ఇండస్ట్రీలో శివపుత్రుడు, అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విక్రమ్.  వాస్తవానికి విక్రమ్ మొదట తెలుగు ఇండస్ట్రీలోనే అడుగు పెట్టారు..కానీ పెద్దగా కలిసి రాలేదు. దాంతో కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.  అక్కడ వరుసగా హిట్ చిత్రాల్లో నటించి చియాన్ విక్రమ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సామీ స్క్వేర్ .ఈ చిత్ర తమిళ మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
Image result for saamy square
తమిళ భాషలో నిర్మిస్తున్నఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు.  ‘సింగం’ మూవీ సిరీస్ కి దర్శకత్వం వహించిన హరి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి.  గతంలో విక్రమ్ హీరోగా దర్శకుడు హరి 'సామి' అనే సినిమాను తెరకెక్కించాడు.

అప్పట్లో ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది .. వసూళ్లపరంగా విక్రమ్ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచింది.  ‘సామి స్క్వేర్’ గా రూపొందిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.  తమిళంలోనే కాదు తెలుగులోను విక్రమ్, కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఈ రెండు భాషల్లోను ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: