దివంగత హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. రాజకీయ నేతలు, అభిమానులు, సెలబ్రిటీలతో మహాప్రస్థానం పరిసరాలు కిక్కిరిసి ఉన్నాయి. అక్కడ ఇసుకేస్తే రాలనంతగా అభిమానులు, కార్యకర్తలు వచ్చారు.  మెహిదీపట్నంలోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి ఆయన పార్థివదేహం చేరుకుంది. పార్థివదేహం పాడెను ముఖ్యమంత్రి కూడా మోశారు. 


హరికృష్ణ అంతిమయాత్ర మహాప్రస్థానం దగ్గరకు చేరుకునే ముందే  దహనం కోసం గంధపుచెక్కలతో ఏర్పాట్లు చేశారు. తన తండ్రి హరికృష్ణ చితికి కల్యాణ్ రామ్ నిప్పు పెట్టారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం తెలంగాణ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, సెల్యూట్ చేశారు.


తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయికుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య తుది అంకం ముగిసింది.  ఇక సెలవు అంటూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన హరికృష్ణ శాశ్వతంగా మన నుంచి దూరమయ్యారు. అంత్యక్రియలు ముగియడంతో బాధాతప్త హృదయంతో ఒక్కొక్కరు అక్కడ నుంచి బయటకు వస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: