సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిచ్చిన సినిమా మహానటీ ఎంతో సంచలన విజయాన్ని నమోదు చేసిందో మనమందరమూ చూసాము . అయితే ఇదే సంచలనాన్ని బుల్లితెర లో కూడా నమోదు చేసింది.  ఆగస్ట్ 19న స్టార్ మా టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు అత్యథికంగా 20.16 రేటింగ్ వచ్చింది. అలా బుల్లితెర వీక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.  నిజానికి మహానటి కంటే హయ్యస్ట్ రేటింగ్స్ తెచ్చుకున్న సినిమాలున్నాయి. రామ్ చరణ్ నటించిన మగధీర, ప్రభాస్ బాహుబలి, మహేష్ శ్రీమంతుడు సినిమాలకు బుల్లితెరపై హయ్యస్ట్ రేటింగ్స్ వచ్చాయి.

Image result for mahanati movie

కానీ ఎలాంటి స్టార్ట్ ఎట్రాక్షన్ లేని మహానటి సినిమాకు ఇంత రేటింగ్ రావడం చెప్పుకోదగ్గ విశేషం. అదే ఈ సినిమాకు టెలివిజన్ రేటింగ్స్ లో ఓ ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది. ఈ సినిమాపై నమ్మకంతో థియేట్రికల్ రిలీజ్ కు ముందే శాటిలైట్ రైట్స్ అమ్మలేదు నిర్మాత అశ్వనీదత్. రిలీజ్ కు ముందు అమ్మితే అతడికి కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చేవి. కానీ రిలీజైన తర్వాత సూపర్ హిట్ టాక్ తో ఏకంగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 

Image result for mahanati movie

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రిలా కీర్తిసురేష్ కనిపించింది. ఆమె నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. నాగ్ అశ్విన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.  వెండితెరపై, బుల్లితెరపై ప్రభంజనం చాటిన ఈ సినిమాకు ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. త్వరలోనే మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: