తెలుగు బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త్’కామెడీ షో ద్వారా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్ అనూహ్యంగా హీరోయిన్ గా మారింది.  గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ జబర్ధస్త్ కామెడీ షో ద్వారా హాట్ హాట్ గా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.  జబర్దస్త్ యాంకర్ రష్మీకి ఉన్నది ఉన్నట్లు బోల్డ్ గా మాట్లాడడం అలవాటు. ఎలాంటి విషయాన్ని అయినా రష్మీ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది.
Image result for రష్మీ గౌతమ్ కాస్టింగ్ కౌచ్
తనపై వస్తున్న వ్యక్తిగత రూమర్స్ విషయాన్ని ప్రస్తావించడానికి కూడా వెనుకాడదు.  ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత శృంగార తరహా చిత్రాలు, బోల్డ్ గా కనిపించింది.  కానీ ఏ చిత్రం కూడా సక్సెస్ కాలేదు..కానీ రష్మికి మాత్రం ఎక్కడా క్రేజ్ తగ్గలేదు. తాజాగా 'అంతకుమించి' చిత్రంతో తన అందాలను ఆరబోస్తూ, ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాంకర్, నటి రష్మి, టాలీవుడ్ ఇండస్ట్రీలో 'కాస్టింగ్ కౌచ్'పై ఏ మాత్రం జంకు లేకుండా సంచలన వ్యాఖ్యలు చేసింది. 
కాస్టింగ్ కౌచ్
ఇండస్ట్రీలో ఇది సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిల మధ్య జరిగేదే. కానీ దానికి అంగీకరించేలా లేదా అనే ఛాయిస్ అమ్మాయిల చేతిలో ఉంటుంది. ఎవరూ రేప్ చేయరు, బలవంత పెట్టారు. జస్ట్ నో చెబితే చాలు అని రష్మీ తెలిపింది.  అయితే అవకాశం కోసం వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ మాత్రమేనని, దాన్ని తాను గౌరవిస్తానని చెప్పిన రష్మి, కెరీర్ బాగుంటుందనిపిస్తే, కాస్టింగ్ కౌచ్ కి అంగీకరించడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించింది.
Image result for రష్మీ గౌతమ్ కాస్టింగ్ కౌచ్
అవకాశాలు ఇస్తామంటే, ఆశపడి వెళ్లిన తరువాత, మళ్లీ గోల పెట్టాల్సిన అవసరం లేదని రష్మి కుండబద్ధలు కొట్టింది. ప్రతి రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ఉందని, కానీ, సినిమా ఇండస్ట్రీనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని ఆరోపించింది.  ఇప్పటి వరకు తనతో ఏ నిర్మాత కూడా తప్పుగా ప్రవర్తించలేదని..నిర్మాతలతో తనకు రెమ్యునరేషన్ విషయంలోనే విభేదాలు వచ్చాయని చెప్పింది. రష్మి కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: