తెలుగు ఇండస్ట్రీలో కుటుంబానికి విలువ ఇచ్చే హీరోలు చాలా మంది ఉన్నారు.  అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు.  ఏ చిత్రం షూటింగ్ పూర్తయినా సరే వెంటనే తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిపోతాడు.  ఇక మహేష్ బాబు కి  తన కొడుకు గౌతమ్ కృష్ణ అంటే ఎంత ఇష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఈరోజు 12వ పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.


ఈ నేపథ్యంలో మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ స్ట్రాగామ్ లో తన కొడుకు కోసం ఓ పోస్ట్ చేశాడు.  ‘కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. అప్పుడే నా కుమారుడికి 12 ఏళ్లు వచ్చేశాయి. నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతుంటే చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించాడు.


మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సైతం తన కుటుంబ సభ్యులకు ఎంతో ప్రాదాన్యత ఇచ్చేవారని..అప్పట్లో వరుసగా చిత్రాల్లో నటిస్తున్న కృష్ణ ఏ మాత్రం విరామం దొరికినా తన పిల్లలతో గడిపేవారని చెబుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: