రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ పై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్న నేపధ్యంలో ఈమూవీ విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజగా ఈచిత్ర షూటింగ్ గురించి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు టాప్ హీరోలకు సంబంధించి యూరప్ లోని పలుదేశాల్లో తెలుగు చిత్రాల షూటింగ్ జరుపుకోవడం తెలిసిన విషయమే. అయితే  ‘అజర్బైజాన్’ దేశం గురించి చాలతక్కువ మంది విని ఉంటారు.   
భారీ స్థాయిలో
ఈదేశంలో షూటింగ్ జరుపుకోబోతన్న తొలి తెలుగు చిత్రంగా రామ్ చరణ్ ఒక సరికొత్త రికార్డు క్రేయేట్ చేస్తోంది. దాదాపు నెలరోజులపాటు బోయపాటి శ్రీను అజర్బైజాన్ దేశంలో ఈసినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించా బోతున్నాడు. అద్భుతమైన లొకేషన్లకు అజర్బైజాన్ పెట్టింది పేరు. 
కాస్పియన్ సముద్ర అందాలు
కాస్పియన్ సముద్రతీర అందాలు చూడటం కోసం ఎందరో ఈదేశంకు వస్తూ ఉంటారు.  30 రోజులపాటు నిర్విరామంగా జరిగే ఈమూవీ షూటింగ్ లో సాంగ్స్ తో పాటు కీలమైన సన్నివేశాలు కూడా అక్కడ చిత్రీకరించనున్నారు. ఈభారీ షెడ్యూల్ కోసం చరణ్ ఇండియా వదలి అందరికీ దూరంగా ఉండబోతున్నాడు అంటూ ఉపాసన ట్విట్ చేసింది. 
 తొలి తెలుగు సినిమా
ఈమూవీలో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ విలనీ లుక్ ప్రత్యేకమైన ఆకర్షణ అని అంటూన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈమూవీ ఫస్ట్ లుక్ విడుదల అవుతుంది అని వార్తలు వస్తు ఉన్నా ప్రస్తుతం బోయపాటి విదేశాల బాట పట్టడంతో చరణ్ అభిమానుల కోరిక నెరవేరక పోవచ్చు అని అంటున్నారు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీలో చరణ్ బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ లరొమాన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: