టాలీవుడ్, కోలీవుడ్ హీరో విశాల్ నటించిన ‘పందెంకోడి’ తెలుగు లో మంచి విజయం సాధించింది.  ఈ సినిమా సక్సెస్ తో తెలుగు లో కూడా విశాల్ కి మంచి క్రేజ్ వచ్చింది.  ఆ తర్వాత విశాల్ తమిళంలో ఏ సినిమా తీసినా తెలుగు లో డబ్ చేయడం ఆనవాయితీ అయ్యింది.  ఈ మద్య విశాల్ నటించి ‘అభిమన్యుడు’ సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు విపరీతమైన కలెక్షన్లు కూడా సాధించింది. 
Image result for pandem kodi 2
తాజాగా విశాల్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘పందెం కోడి2’తెలుగు టీజర్ రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాలో విశాల్ మాజీ లవర్..శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా నటించింది.  మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు.  పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథ అనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

దేవాలయం .. జాతర నేపథ్యంలోని సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేసి వదిలారు. అయితే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ విలనీ షేడ్ కనిపిస్తూ చాలా పవర్ ఫుల్ గా ఉంది. "నేనింకా ఆడుకోవడం మొదలు పెట్టలేదు .. అడ్డుకోవడమే మొదలు పెట్టాను" .. "ఇది పులి .. మేక ఆట కాదు .. పులి - మేక కలిసి ఆడే ఆట" అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. గతంలో రిలీజ్ అయిన పందెం కోడి సినిమా సీక్వెల్ ఇది. 


మరింత సమాచారం తెలుసుకోండి: