టాలీవుడ్ ని మరో దురదృష్టం వెంటాడింది.  ప్రముఖ నటులు నందమూరి హరికృష్ణ మరణం జీర్ణించుకోక ముందే మరో విషాద సంఘటన టాలీవుడ్ లో చోటు చేసుకుంది.   మహిళా దర్శకురాలు, తెలుగు సినీ పరిశ్రమలో అందరి తలలో నాలుకలా ఉండే పి ఆర్ వో బి.ఎ.రాజు సతీమణి జయ గుండెపోటుతో ఈరోజు మరణించింది.

చంటిగాడు, లవ్లీ, గుండమ్మగారి మనవడు, వైశాఖం ఇలాంటి చిత్రాలు తీసిన  మహిళా దర్శకురాలు బి.జయ గుండెపోటుతో కన్నుమూశారు. సాధారణంగా మహిళా దర్శకులు అనగానే ఫెమినిస్టు కథలతోనో, హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కుటుంబ కథలతోనో మాత్రమే చిత్రాలు తెరకెక్కించారు.   2003 లో చంటిగాడు మూవీతో మెగా ఫోన్ పట్టిన జయ..తెలుగు సినీ రంగంలో తొలి మహిళా ఎడిటర్ గానూ పాపులర్ అయ్యారు.
Image result for b jaya director condolence
కామ్న జెత్మలానీ, శాన్వి, సుహాసిని వంటి హీరోయిన్లను ఆమె తెలుగు తెరకు పరిచయం చేశారు. ప్రముఖ సినీ పాత్రికేయుడు, పీఆర్వో బి.ఏ.రాజు ఆమె భర్త. ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీలో ఎమ్మే చేసిన జయ ఓ సినీ వార పత్రికను కూడా నిర్వహిస్తున్నారు.  ఆమె అంత్యక్రియలు పంజాగుట్ట లోని స్మశాన వాటికలో జరగనున్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Image result for b jaya director condolence
ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, వెంకటేష్, మంచు మనోజ్, ఆది, ఛార్మి, ఝాన్సీ, వంశీ పైడిపల్లి, సుకుమార్, పూరి జగన్, గుణశేఖర్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు ఆమెకు నివాళి అర్పించారు. ఆమె భర్త బీఏ రాజును ఓదార్చారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, జయలాంటి దర్శకురాలు టాలీవుడ్ కు అరుదుగా దొరుకుతారని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.




మరింత సమాచారం తెలుసుకోండి: