ఒరు అదార్ లవ్ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో కన్నుగీటే సన్నివేశంతో నటి ప్రియా వారియర్ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా రాని క్రేజ్ ఒక్క సన్నివేశంతో ఈ అమ్మడు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.  సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు సైతం ఈ అమ్మడికి ఫిదా అయ్యారు. 
Image result for priyan variour
ఎంత పాపులారిటీ సంపాదించినా..ఆ పాట తమ మనోభావాలు తీసిందని ముస్లింల ఆఖరి ప్రవక్త మొహమ్మద్, ఆయన భార్య ఖతీజాపై మలయాళీ ముస్లింలు పాడుకునే పాటను ఈ చిత్రంలో అభ్యంతరకరమైన రీతిలో వాడారంటూ హైదరాబాద్ లో కేసు దాఖలైంది.
Image result for priyan variour
ఈ పాటలో నటించిన ప్రియా వారియర్, దర్శకుడు ఒమర్ లులూపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.    మలయాళ నటి ప్రియాప్రకాశ్‌ వారియర్‌ దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న కేసు ప్రియాప్రకాశ్‌కు ఊరటనిస్తూ ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
Image result for priyan variour
ఈ సందర్భంగా కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. ‘ఓ సినిమాలో ఎవరో ఏదో పాట పాడారు. మీకు దానిపై కేసు దాఖలు చేయడం తప్ప వేరే పనీపాటా లేదా?’ అని పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఒరు అదార్ లవ్’ సినిమా సెప్టెంబర్ 14న విడుదల కానుంది


మరింత సమాచారం తెలుసుకోండి: