కన్నుగొట్టిన కమలనయని ప్రియా ప్రకాష్ వారియ‌ర్ గుర్తుందా? కొన్ని నెల‌లక్రితం ఈ మళయాళ కుట్టి పేరు దేశ‌మంతా మార్మోగింది. ఒక మ‌ల‌యాళ సినిమాకి సంబంధిం చిన పాట‌లో హీరోకి క‌న్నుగీటిన ఒక దృశ్యం సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అయింది. కన్నుగొట్టిన వేళావిశేషమో? ఏమో? ఓవ‌ర్‌ నైట్ దేశ‌ మంతా ఆమె గురించి మాట్లాడుకొంది. నాలుగు నెల‌ల త‌ర్వాత అంద‌రూ ఆమె గురించి ఆమె కన్ను గొట్టుడు గురించి మర్చిపోయారు.
Image result for priya prakash varrier case in supreme court
కాకపోతే రాహుల్ గాంధి పార్లమెంట్ లో కన్ను గొట్టినప్పుడు మాత్రం ఆమెను గుర్తు చేసుకున్నారు అంతా మరోసారి. ఆమె కన్నుగొట్టిన విషయం అందరికి గుర్తొచ్చి రాహుల్ పై ప్రియా పేరడీతో ఎంజోయ్ చేసుకున్నారు. ఆ సినిమా ఏమైందో మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు.

ఐతే ఆ సినిమాలోని ఆ పాట‌పై తెలంగాణ‌కి చెందిన కొంద‌రు యువకులు  తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఆ పాట ఉందని అభిప్రాయపడి కేసువేశారు. ఇదే తరహ లో మహారాష్ట్ర లో కూడ కొందరు కేసులు నమోదు చేశారు.  తెలంగాణతో పాటు దేశంలో పలుచోట్ల తనపై దాఖలైన పిటిషన్లపై ప్రియా ప్రకాష్ వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు ఇప్పుడు విచార‌ణ‌కి వ‌చ్చింది. 

Image result for oru adaar love

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ప్రియా నటించిన ‘ఒరు అదార్ లవ్’ సినిమాలో ఆమె కన్ను గీటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఆమెపై హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె కథానాయికగా నటించిన ‘ఒరు అదార్‌ లవ్’ చిత్రంలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా పాటలు ఉన్నాయంటూ తెలంగాణకు చెందిన కొందరు ముస్లింలు కేసు వేశారు. దాదాపు నాలుగు నెలల పాటు సాగిన విచారణ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ప్రియాపై వేసిన కేసును కొట్టేసింది. మీకు వేరే పనేం లేదా అని కేసులు వేసిన వాళ్లకు చీవాట్లు పెట్టింది. చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి కేసులు వేయొద్దని సూచించింది.

Image result for oru adaar love

‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియ కన్ను కొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ పాట కేరళకు చెందిన ముస్లిం సంప్రదాయపు గీతం అని, ఇందులో ప్రియ కన్నుకొట్టడం అసభ్యకరంగా ఉందని పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అబ్దుల్‌ రహూఫ్‌ కథానాయకుడిగా నటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Image result for priya prakash varrier case in supreme court
మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి అంటూ సినిమాల‌పై కేసు వేస్తున్న ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్ట్ తీర్పు ఒక రకంగా చెంప‌పెట్టు లాంటిది. ప‌నీపాటా లేకుండా సినిమా ల‌పై కేసులు వేయ‌డం ఏంట‌ని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా కాస్త గ‌ట్టిగానే మందలించారు. ఈ కేసు రిజిస్టర్ చేయడం పనిలేని వ్యవహారమేనంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేసు కొట్టివేశారు. 
Image result for priya prakash varrier case in supreme court
ఈ సందర్భంగా  'సినిమాలో ఏదో పాట పాడితే, మీకు కొచ్చిన నొప్పేంటంతా మీకు కేసులు వేయడం తప్ప వేరే మరో పని లేదా?'  అని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స్వయానా పిటీష‌న్ వేసిన వారికి అంక్షింత‌లు వేసేశారు. దీంతో  ప్రియా ప్రకాష్ వారియర్ కు ఈ కేసులో ఊరట లభించినట్టైంది.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: