టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ.  కెరీర్ బిగినింగ్ లో హర్రర్, కామెడీ, మాఫియా కాన్సెప్ట్ తో ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కించారు.  ఆ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఎన్నో మాఫియా, హర్రర్ సినిమాలు తీశారు.  అందులో కొన్ని సూపర్ హిట్ కాగా కొన్ని దారుణ ఫలితాలు ఇచ్చాయి.  అయితే దర్శకుడిగా మాత్రం రాంగోపాల్ వర్మ మంచి క్రేజ్ సంపాదించారు.  అయితే గత కొంత కాలంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కావడం లేదు.  


దాదాపు అన్ని బాక్సాఫీస్ వద్ద బొర్లా పడ్డాయి.  ఆ మద్య అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యింది..కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  దాంతో ఇక మనోడిక కెరీర్ కి పులిస్టాప్ పెడతారని అనుకున్నారు.  కానీ, అందరికీ షాక్ ఇస్తూ... భైరవగీత అనే సినిమా  తర నిర్మాణంలో రూపొందించి రేపు ట్రైలర్ రిలీజ్ చేయనున్నాడు. ఈ సినిమాలో ధనన్జయక మరియు ఇర్రా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. 


సిద్ధార్ధ తాతులు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుంది. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.  దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇదేదో మరో ప్రేమ కథా గా కనిపిస్తుంది.   మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: