విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాను బన్ని వాసు నిర్మించారు. ఆగష్టు 15న రిలీజైన ఈ సినిమా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.


ఇక మరో పక్క ఈ సినిమా చాలా చోట్ల సంచలన రికార్డులను సృష్టించింది. తమిళనాడులో గీతా గోవిందం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. ఈ సినిమా తమిళనాడు మొత్తం మీద 5 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. కేవలం తెలుగు వర్షనే ఈ రేంజ్ కలక్షన్స్ వసూళు చేయడం రికార్డే.


డబ్ చేసి రిలీజ్ చేయకున్నా సరే విజయ్ కు తమిళ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా విజయాన్ని తమిళ మీడియాలో కూడా ప్రస్థావించడం జరిగింది. బాహుబలి తర్వాత ఇలాంటి క్రేజీ రికార్డ్ విజయ్ సొంతం చేసుకోవడం చూస్తుంటే విజయ్ కోలీవుడ్ లో కూడా స్టార్ అని చెప్పడంలో సందేహం లేదు.


తెలుగులో ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తుండగా కోలీవుడ్ లో నోటా సినిమా చేస్తున్నాడు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ విధమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ రానున్న రోజుల్లో మిగతా స్టార్ హీరోలకు షాక్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు. యూత్ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ తన ప్రతి సినిమాతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: