గత కొన్ని రోజుల నుంచి క్రిష్ దర్శకత్వంలో కంగనా నటిస్తున్న ‘మణికర్ణిక.. ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ ఫిల్మ్‌పై దుమారం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. ఝాన్సీ లక్ష్మీబాయి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఝాన్సీ రోల్‌లో కంగనా రనౌత్‌ నటిస్తోంది. ఈ సినిమా నుంచి దర్శకులు క్రిష్ తప్పుకున్నారని..అందుకే క్లాప్ బాక్స్ పై కంగనా పేరు పెట్టుకుందని వార్తలు వచ్చాయి..అంతే కాదు దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
Image result for మణికర్ణిక సోనూసూద్
తాజాగా ఈ  సినిమా నుంచి నటుడు సోనూసూద్‌ డ్రాపైనట్లు కంగనా వెల్లడించింది. ఇందులో సదాశివ్‌ అనే మరాఠా రాజు రోల్‌లో ఆయన నటించాల్సివుంది. సోనూ‌పై ఇంకొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తికానుండగా ఆయన వైదొలగాడు. దీంతో మణికర్ణిక ప్రాజెక్టులో ఏం జరుగుతోందన్న చర్చ బాలీవుడ్‌లో సాగుతోంది.అయితే కంగనాతో విభేదాల కారణంగానే సోను ఈ సినిమా నుండి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. సెట్లో ఆయనను తక్కువ చేసి చూడడమే ఇందుకు కారణం గా తెలుస్తుంది.

ఇక ఇటీవల డైరెక్టర్ క్రిష్ కూడా ఈచిత్రం నుండి తప్పుకున్నాడని దానికి కూడా కారణం కంగనానే అని దర్శకత్వ బాధ్యత అని టాలీవుడ్ టాక్.ఈ నేపథ్యంలో సోనూ సూద్ కూడా తప్పుకున్నారని తెలుస్తోంది. ముందుగా చెప్పినట్టుగా కాకుండా తన పాత్రలో మార్పులు చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట. అవతల నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా అనిపించకపోవడంతో, మరొకరితో ఆ పాత్రను పూర్తిచేయించుకోమని చెబుతూ, తాను తప్పుకుంటున్నట్టుగా తేల్చి చెప్పేశారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: