ఉపాధ్యాయ దినోత్సవం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణ  అబ్దుల్‌ కలామ్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య జె.హెచ్‌. రైట్‌. ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ ఎందరో అభిమానులను పొందడమే కాకుండా ప్రపంచస్థాయిలో అత్యున్నత గౌరవాలను పొందిన ఈముగ్గురు వల్ల ఉపాధ్యాయ వృత్తికి విపరీతమైన గౌరవం వచ్చింది. గురువును పూజించే విషయంలో దేశాల మధ్య తేడా ఉండొచ్చుగాని గౌరవించడం అనేది ప్రపంచమంతటా ఒకటే. 
Sarvepalli Radhakrishnan
ఉపాధాయుడ్ని గౌరవించే విధానాలు ఆదేశ సంస్కృతి సాంప్రదాయాలను బట్టి మారిపోతూ ఉంటుంది. ప్రపంచంలో ఏవ్యక్తి అయినా మనసులో గురువు పట్ల చూపించే గౌరవంలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. దీనికికారణం ఒకవ్యక్తి అభివృద్ధిలో గురువుకు గల కీలకపాత్ర అని మనకున్న నమ్మకం. అయితే మన మత గ్రంధాలలో గురువుకిచ్చినంత ఉన్నత స్థానం ప్రపంచంలో ఏమత గ్రంథాలలోను లేదు.  ఇంతటి ప్రజాదరణ అపారమైన గౌరవం ఉన్న కారణంగానే మనదేశంలో ఎంతోమంది ఉపాధ్యాయులు నాయకులయ్యారు. 

వీరిలో ముఖ్యంగా చెప్పకోవలసిన వారు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఒక ఉపాధ్యాయుడు ఈభారత ఉపఖండానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. అందుకనే ఆయన పుట్టినరోజును మనదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వలన ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవం మరింత పెరిగింది. ఈకారణంగానే ఉపాధ్యాయునికి సంబంధించిన ఏసమావేశమైనా సర్వేపల్లి గురించి ప్రస్తావించకుండా పూర్తికాదు.  రాధాకృష్ణన్ తరువాత అత్యంత ప్రముఖంగా చెప్పవలసింది అబ్దుల్‌ కలామ్‌ జీవితం. తన రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తరువాత చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో తిరిగి ఉపాధ్యాయుడుగా మారి అక్కడి విద్యార్దులకు పాఠాలు చెపుతూ ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవాన్ని తీసుకువచ్చారు. 

ఒక విద్యార్ధికి జ్ఞాన సముపార్జన అన్నది పుస్తక పఠనం వలనో దూర విద్యా విధానం వల్లనో రాదనీ కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే విద్యార్ధులకు ఏర్పడే అనేక సందేహాలను వివరిస్తూ చదువు పట్ల శ్రద్ధ పెంపోదించడంలో ఉపాధ్యాయుడుకి మరెవరు సాటి రాలేరు అంటూ అబ్దుల్ కలామ్ అనేక సందర్భాలలో అభిప్రాయ పడ్డారు. ‘మరణించే వరకు పనిచేయడమే ఆరోగ్యం’ అని యావత్‌ ప్రపంచానికి తను ఆచరించి ఈసందేశాన్ని అందించిన మహాత్ముడు అబ్దుల్ కలామ్‌. 1893లో విశ్వమత సభల ద్వారా భార త ధార్మిక సంప్రదాయాలను మన హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామి వివేకానంద వెనుక ఆచార్య జె.హెచ్‌.రైట్‌. లేకుంటే వివేకానందకు విశ్వ మత మహాసభల్లో ప్రసంగించేందుకు అవకాశం లభించి ఉండేది కాదు అన్న అభిప్రాయాన్ని చాలామంది ఇప్పటికీ చెపుతూ ఉంటారు. సమాజాన్ని మార్చగలిగి విద్యార్ధులను సరైన బాటలో పెట్టగలిగిన శక్తి  ఒక్క గురువులకు మాత్రమే ఉంది అన్న విషయాన్ని ఈముగ్గురి మహాత్ముల జీవితాలు ఋజువు చేస్తున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈముగ్గురుని స్మరించుకుని గౌరవించడం ప్రతి విద్యార్థి కర్తవ్యం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: