తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్ గా నటించి..ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్న చలపతిరావు తనయుడు రవిబాబు ‘అల్లరి’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.  నటుడిగా, దర్శకుడిగా ఎన్నో వైవిధ్య భరిత సినిమాలు..పాత్రల్లో నటిస్తున్నారు రవిబాబు.  తాజాగా రవిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘అదిగో’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అల్లరి, లడ్డూబాబు వంటి కామెడీ సినిమాలతో పాటు నచ్చావులే వంటి ప్రేమకథాచిత్రం, అవును, అనసూయ, అమరావతి వంటి హారర్ చిత్రాలను ఆయన రూపొందించారు.

  తాజాగా ఇప్పుడు ఓ   పంది పిల్లను ప్రధాన పాత్రలో చూపిస్తూ అదుగో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వస్తుండటంతో ‘అదుగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి.  పాత్రలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పంది పిల్ల తనను తాను పరిచయం చేసుకుంటున్నట్టుగా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. అయితే పంది పిల్లతో రవిబాబు చేసిన ప్రయోగం ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: