శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈమె ఆరోపణలు కోలీవుడ్ కి కూడా తాకాయి . అయితే ఈ విషయం మీద ఇప్పటికే చాలా హీరోయిన్స్ స్పందించారు. తాజాగా ఈ లిస్ట్ లోకి రష్మి కూడా చేరిపోయింది. తనను ఇప్పటివరకు ఎవరూ గోకలేదంటోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. దీంతో పాటు కాస్టింగ్ కౌచ్ పై సూటిగా స్పందించింది. 
కాస్టింగ్ కౌచ్ తప్పేంటి... నేను దానిని గౌరవిస్తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రష్మీ...!

ఆమె క్యాస్టింగ్ కౌచ్ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమెకు ఓ ప్రశ్న ఎదురవగా కుండబద్ధలు కొట్టినట్లు సమాధానమిచ్చింది. అవకాశం ఇస్తానంటే వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ అని చెప్పింది. అంతేకాదు.. ఇలాంటి అవకాశానికి తను క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టననీ, దాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. కెరీర్ బాగుంటుందనిపిస్తే అలా వెళ్లడంలో తప్పు ఏమీ లేదని తేల్చి చెప్పింది.


కాస్టింగ్ కౌచ్ తప్పేంటి... నేను దానిని గౌరవిస్తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రష్మీ...!

అవకాశం కోసం ఒకరు, అవకాశం ఇచ్చేందుకు ఇంకొకరు పరస్పరం అంగీకారంతో జరిగేదానికి క్యాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టడం ఏంటంటూ ఎదురు ప్రశ్నలు వేసింది. గట్టిగా చెప్పాలంటే... అవకాశం ఇస్తానంటే వెళ్లి బెడ్రూంలో బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చి క్యాస్టింగ్ కౌచ్ అంటూ గొడవ చేయడం ఏంటని అడిగేసింది. తన మటుకు తనకు ఇప్పటివరకూ అలాంటి అనుభవం కలుగలేదనీ, తన పారితోషికం విషయంలోనే కొన్నిసార్లు సమస్యలు వచ్చాయని స్పష్టీకరించింది. మొత్తమ్మీద క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆందోళన చేస్తున్న శ్రీరెడ్డికి ఇలా చురకలు వేసినట్లు అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: