సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.  సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా మారారు.  మురారి, పోకిరి, అతడు, దూకుడు లాంటి సినిమాతో మాస్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు.  ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాతో ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాడు.  అయితే హీరోగా తనకు అంత ఇమేజ్ ఉన్నా..ఎన్నో యాడ్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.


 ‘భరత్ అనే నేను’తో భారీ హిట్ అందుకొని ఆ క్రేజ్ ను ఇంకా పెంచుకున్నాడు మహేష్. ఇప్పటి వరకు క్లోజప్ యాడ్ లో ఎంతో మంది నటించారు.  ఈ యాడ్ లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించి అదరగొట్టారు. తాజాగా మహేష్ బాబు కూడా ‘క్లోజప్’ యాడ్ లో నటించాడు.   ఓ అందమైన అమ్మాయితో..దగ్గరగా రా.. దగ్గరగా రా… దగ్గరగా రావా అంటూ స్టెప్పులేశాడు.  ఈ యాడ్ లో మహేష్ బాబు నవయువకుడిలా కనిపిస్తున్నాడు.


అయితే మహేష్ ఖాతాలో ‘థమ్స్ అప్ , మహీంద్రా , టాటా స్కై, ఐడియా సెల్యూలర్, చెన్నై సిల్క్స్ మొదలైన వాటికీ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే.  తాజాగా క్లోజప్ యాడ్ తన ఖాతాలో వేసుకున్నాడు.


రెడ్ కాస్ట్యూమ్స్ లో ప్రిన్స్ మహేష్ బాబు యధావిధిగా అదిరిపోగా, ఈ యాడ్ దాదాపుగా రెండు నిముషాల పాటు ఉండడం విశేషం.  కాకపోతే..‘క్లోజప్’ ఫేమస్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ సాగిన ఈ యాడ్ బహుశా టీవీలలోకి వచ్చేపాటికి సెకన్ల నిడివికి కట్ అవుతుంది గానీ, రెండు నిముషాల నిడివి గల ఈ ఫుల్ సాంగ్ ను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: