అందం కొందరికి  అలా అలా రెట్టింపు అవుతూనే ఉంటుంది. వయసు ఎక్కడో ఆగిపోయి సొగసును చలోమంటుంది. ఆ వరాన్ని పొందిన అతివలు వివరంగా తమ అందాలను బయటపెడితే కుర్ర కారు కేక పెట్టకుండా ఉంటుందా. లెక్కలేనట్లు సోయగాల ఆరబోతతో ఉక్కబోత బెడితే ఊపిరి ఆడక ఉరి వేసుకోరా. అదేంటో కానీ శ్రియ పెళ్ళి అయినా కూడా అల్లరి చేసేస్తోంది. నిన్నా మొన్నటి చిన్నదిలా బ్యూటీతో గుండెను లూటీ చేస్తోంది.



ఆ మధ్యన ఆండ్రూ  ఆండ్రూ కోశ్చీవ్ ని లవ్ మారేజ్ చేసుకున్న శ్రియ కొన్నాళ్ళు హానీమూన్ బాగానే ఎంజాయ్ చేసింది. ఇపుడు ఆమె చూపు మళ్ళీ సినిమాలమీద పడిందట. అదీ తనకు మాంచి బ్రేక్ ఇచ్చిన టాలివూడ్ మీద కన్నేసిందిట. అందుకే లక్కు సరిచూసుకోవడానికి ఎక్కడలేని అందాలనూ అలా పరచేస్తోంది. 



పెళ్ళి అయిన ఈ ముద్దు గుమ్మ ఎక్కడా తగ్గనని క్లారిటీగానే చెబుతోంది. పరువాల పదనిసలు చూసుకోమంటోంది. ఒక్క చాన్స్ ఇస్తే పరుగులు పెట్టిస్తానని చాలెంజ్ విసురుతోంది. టాలివుడ్ లో ఈ మధ్యన సీనియర్ హీరోలకు పైర్ చాల కష్టంగా ఉంది. బెస్ట్ చాయిస్ వారికి శ్రియ అయింది. పెళ్ళి తరువాత ఆమె మూవీస్ మానేస్తుందనుకున్న వారికి షాక్ ఇచ్చేలా నేనున్నానంటోంది. 



సో. నిర్మాతలెవరైనా ముందుకు వస్తే శ్రియా రెడీ అంటోంది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ వీరభోగ వసంతరాయలు విడుదలకు సిధ్ధంగా ఉంది. ఎటూ హానీమూన్ అవుతోంది. ప్రోడ్యూసర్ ఎవరైన వస్తే శ్రియా మళ్ళీ కెమెరా ముందుకు రావడం ష్యూర్ అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: