హరికృష్ణ అకాలమరణంతో నందమూరి సింహం బాలయ్యలో మార్పులు తీసుకురావడమే కాకుండా   హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లకు ఆకష్ట సమయంలో బాసటగా నిలిచి బాలయ్య ప్రవర్తించిన తీరు నందమూరి అభిమానుల ప్రశంసలు అందుకునేలా చేసింది. దీనితో నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అయిపోయింది అన్న ఆనందంతో జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ కు బాలకృష్ణ అతిధిగా రాబోతున్నాడు అంటూ నందమూరి అభిమానులు గాసిప్పులను వార్తలుగా మార్చి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. 
NTR
ఈవార్తలు వాస్తవం అనుకుని కొంతమంది ఈవార్తలలో నిజాలు ఎంత అనేవిషయం పై చర్చలు చేస్తున్నారు. బాలయ్య జూనియర్ ‘అరవింద సమేత’ ఫంక్షన్ కు వస్తే అది కలక్షన్స్ విషయంలో సంచలనమే అని జరుగుతున్న ప్రచారం క్రిష్ కు కొత్త ఆలోచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం నిర్మాణం జరుపుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణలో ఎన్టీఆర్ యుక్త వయసులో ఉండే సీన్స్ చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. వాస్తవానికి యంగ్ ఎన్టీఆర్ పాత్రకు మొదట్లో శర్వానంద్ ను అనుకున్నా అది కుదరలేదు. దీనితో మోక్షజ్ఞను రంగంలోకి దింపాలని క్రిష్ సలహాలు ఇస్తున్నా ఈసలహాల పై బాలకృష్ణ ఎటూ నిర్ణయించుకోలేక పోతున్నాడు. 
Krish Director wiki
ఇలాంటి పరిస్థుతులలో ఈబయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ ను యంగ్ ఎన్టీఆర్ గా చూపెడితే ఎన్నికల ముందు రాబోతున్న ఈమూవీకి 200 కోట్ల కలక్షన్స్ రావడం ఖాయం అన్న సూచనను క్రిష్ గట్టిగా బాలకృష్ణ దగ్గర చేసినట్లు టాక్. వాస్తవానికి బాలయ్య జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం ఏమాత్రం లేకపోయినా మొన్న హరికృష్ణ మరణం తరువాత బాలయ్య చంద్రబాబుతో కలిసి అన్నీ  తానై కళ్యాణ్ రామ్ జూనియర్ లకు మానసిక ధైర్యాన్ని అందించాడు. ఇప్పుడు అదే స్పూర్తితో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ను ఎంపిక చేస్తే నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటే అన్న సందేశంతో పాటు జూనియర్ అభిమానులు కూడ బాలయ్య అభిమానులుగా మారే ఆస్కారం ఉంది అని క్రిష్ వివరణాత్మకంగా చెప్పిన సలహాకు బాలయ్య  ప్రస్తుతం ఈఆలోచనల పై సుధీర్ఘంగా ఆలోచనలో పడినట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: