బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో కామన్ మెన్ గా హౌజ్ లోకి వెళ్లిన గణేష్ ఎట్టకేలకు బయటకు వచ్చాడు. మరో 3 వారాలే మిగిలి ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో టఫ్ ఫైట్ జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన టాస్క్ లో గీతా మాధురి కౌషల్ ను సీజన్ మొత్తం నామినేట్ చేయగా ఈ వారం నామినేషన్ లో కౌశల్ సేఫ్ అయ్యాడు.


సెకండ్ సీజన్ లో మొదటిసారి ఈ వారం డబుల్ నామినేషన్ జరుగుతుంది. శనివారం కామన్ మెన్ గణేష్ ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఇక అమిత్, సామ్రాట్, నూతన్ నాయుడులు ఇంకా నామినేషన్ లోనే ఉన్నారు. సెకండ్ ఎలిమినేటర్ రేసులో అమిత్, నూతన్, సామ్రాట్ ఉన్నారు. 


వారిలో ఎవరు ఈరోజ్య్ బయటకు వస్తారో చూడాలి. అసలైతే బిగ్ బాస్ హౌజ్ లో ఇన్ని సార్లు రీ ఎంట్రీ ఇస్తున్న నూతన్ నాయుడు ఈ వారం బయటకు వచ్చేస్తాడని అంటున్నారు. అయితే అమిత్ కు ఎలిమినేషన్ గండం ఉందని తెలుస్తుంది. సామ్రాట్ కాస్త సేఫ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నా సమీకరణాలు చూస్తుంటే కౌశల్ ఆమీర్ నూతన్, అమిత్ లను సేవ్ చేసి సామ్రాట్ ను ఎలిమినేట్ చేసినా చేస్తారని అంటున్నారు.


కౌశల్ ఆర్మీ ప్రభావం ఎలిమినేషన్స్ మీద బాగా ఉంది. సీజన్ మొత్తం నామినేట్ అయినా సరే కౌశల్ కచ్చితంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సీజన్ విన్నర్ గా టైటిల్ కొట్టే అర్హత కౌశల్ కే ఉందని అంటున్నారు. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: