ఈ మద్య టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  సినీ, రాజకీయ నేపథ్యంలో బయోపిక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.  ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’సినిమా మంచి విజయం సాధించింది.  ఈ సినిమాలో కీర్తి సురేష్ మహానటి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక బాలీవుడ్ లో కూడా సినీ హీరో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమా వచ్చింది.  ప్రస్తుతం తెలుగు లో మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో వస్తుంది.

రాజకీయ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతుంది.  అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితక కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమా టైటిల్ ను ‘చంద్రోదయం- బయోపిక్ ఆఫ్ లివింగ్ లెజెండ్’గా ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.  ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి రాజకీయ నేతగా ఎలా ఎదిగారు. 
Image result for chandrodayam biopic
విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగారు అన్న విషయం ఈ సినిమాలో చూపించబోతున్నారట.  ఇప్పటికే చంద్రోదయం సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది.సినిమాలో చంద్రబాబుగా వినోద్ నువ్వుల, ఎన్టీఆర్ గా భాస్కర్ నటిస్తుండగా.. వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ పీఆర్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: