ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసి చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ మూవీలోని పాత్రలను జనంకు పరిచియం చేయడానికి అప్పట్లో రాజమౌళి అనుసరించిన పద్ధతి అప్పట్లో హాట్ టాపిక్. ఆసినిమాలో నటించిన ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను ఆపాత్రలలో నటించిన స్టార్స్ పుట్టినరోజునాడు విడుదల చేసి ‘బాహుబాలి’ లోని వివిధ పాత్రల పరిచయానికి అప్పట్లో శ్రీకారం చుట్టాడు.   
Chiranjeevi's Birthday Gift To You - Motion Poster Of Sye Raa Narasimha Reddy
ఇప్పుడు ఇదే పద్ధతిని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ‘సైరా’ టీమ్ అనుసరిస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి పుట్టినరోజునాడు ఈసినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసి సంచలనాలు ‘సైరా’ టీమ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కన్నడ నటుడు కిచ్చా సుధీప్ బర్త్ డే సందర్భంగా ‘సైరా’ లోని అతడి లుక్ ను ఈరోజు విడుదల చేసారు. 

sye raa narasimhareddy teaser: an epic in the making!

ఈమూవీలో సుధీప్ రాజు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర గెటప్ ను ఇప్పుడు బయటకు వదిలారు. బాహుబలిలో కూడా సుదీప డిఫరెంట్ గెటప్ తో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పద్ధతిని అనుసరిస్తూ గతంలో ‘గోనగన్నారెడ్డి’ గా బన్నీ వేసుకున్న బ్లాక్ డ్రెస్, అలాగే బాహుబలిలో మాదిరిగా తలకు పాగా ఇలా ఈ రెండు సినిమాలలోని సెంటిమెంట్ ను సుదీప్ లుక్ కు వాడారు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించి అమితాబ్ బచ్చన్, నయనతారల లుక్ బయటకు రావడంతో ఇప్పుడు ఇదే సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటుల లుక్స్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


రాబోయే సమ్మర్ ను టార్గెట్ చేస్తూ 2019లో విడుదలకు రెడీ అవుతున్న ఈమూవీ ద్వారా ‘బాహుబలి’ రికార్డులకు చెక్ పెట్టాలని చిరంజీవి చరణ్ లు కలిపి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు విజయాన్ని ఇస్తాయో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: