స్టార్ బర్త్ డే అంటే ఫ్యాన్స్, సెలబ్రిటీస్ విషెష్ అందిచడం కామనే. అయితే వారి వారి ఫాలోయింగ్ ను బట్టి ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగులో ఎంత క్రేజ్ ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ అంతా విషెస్ తో నిండిపోయింది.


హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ తో 24 గంటలు గడవక ముందే ఏకంగా 10 మిలియన్ ట్వీట్స్ రావడం అంతా చర్చాంశమైంది. పవన్ బర్త్ డే నాడు అతని చరిష్మా తెలిసేలా ఈ ట్విట్టర్ ట్రెండింగ్ కనబడుతుంది. జనసేన అంటూ ప్రజల్లోకి వచ్చిన పవర్ స్టార్ ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు రాజకీయ వేత్త కూడా.


2019 ఎన్నికల్లో రాజకీయాల్లో తన ప్రభావం చూపించాలని చూస్తున్న పవన్ ప్రజల్లో ఎంత క్రేజ్ సంపాదించాడని చెప్పడానికి ఈ బర్త్ డే ట్వీట్స్ చూస్తే అర్ధమవుతుంది. మరే హీరోకి ఈ రేంజ్ బర్త్ డే ట్వీట్స్ రాలేదని చెప్పొచ్చు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు కొన్నాళ్లు గ్యాప్ ఇస్తున్నట్టు ప్రకటించిన పవన్ వరుసగా సినిమాలు చేస్తే ఈ క్రేజ్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది.


2019 ఎన్నికల తర్వాత పవన్ మళ్లీ సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేసే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రం తో రుస్తుం సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ సినిమా కల ఎప్పుడు ఎన్రవేరుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: