బిగ్ బాస్ రెండో సీజన్ లోనే కాదు ఏ సీజన్ లో కూడా ఏ కంటెస్టంట్ కు రాని సదవకాశం నూతన్ నాయుడుకి వచ్చింది. ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయిన ఆయన రీ ఎంట్రీ కోసం జరిగిన ఓటింగ్స్ లో ఎక్కువ సాధించి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అలా వచ్చిన ఆయన ఈసారైనా గేం ఆడుతాడనుకుంటే ఒక వారం మొత్తం కాలికి దెబ్బ తగిలిందని ఉన్నాడు.


ఇక ఆ తర్వాత వారం కెప్టెన్సీ టాస్క్ లో కౌశల్ కు సపోర్ట్ గా ఉంటూ షోల్డర్ కు దెబ్బ తగలడంతో మరో నాలుగు రోజులు బయటకు వెళ్లొచ్చాడు. నూతన్ నాయుడు రీ రీ ఎంట్రీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే ఈ వారం కౌశల్, అమిత్, సామ్రాట్, గణేష్ లతో నూతన్ నాయుడు కూడా నామినేషన్ లో ఉన్నాడు. 


గణేష్ ను ఆల్రెడీ శనివారమే ఎలిమినేట్ చేసిన నాని డబుల్ నామినేషన్ లో భాగంగా నూతన్ నాయుడును ఎలిమినేట్ చేయడం జరిగింది. కౌశల్ ఆర్మీ సపోర్ట్ ఉన్నా నూతన్ నాయుడు ఎలిమినేట్ అవడం కాస్త షాకింగ్ గానే ఉంది. అయితే కౌశల్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని సేవ్ చేసే క్రమంలో మిగతా వారిని పట్టించుకోవడం మానేశారని అనుకున్నారు.


ఫైనల్ గా నూతన్ నాయుడు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాడు. ఇక కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈసారి నామినేషన్స్ లో కూడా ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. గీతా మాధురి కౌశల్ ను సీజన్ మొత్తం నామినేట్ చేసింది కాబట్టి ఈసారి కౌశల్ ను కాకుండా మరో ముగ్గురు నామినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: