హరికృష్ణ మరణంతో బాలయ్య ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న దూరం ఎట్టకేలకు తొలగిపోయిందనీ ఇద్దరూ మళ్లీ కలిసిపోయారని ప్రచారం జరుగుతున్న నేపధ్యం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో ఈనెలలో జరగబోతున్న ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ కి బాలయ్య ముఖ్యఅతిథిగా అదేవిధంగా ఎన్టీఆర్‌ బయోపిక్‌లో జూనియర్‌ అతిథి పాత్ర చేస్తాడనే వార్తల హడావిడి మొదలై అనేక వార్తలు పుట్టుకువచ్చాయి. 

అయితే ఈవార్తల పై జూనియర్ అభిమానులలోని ఒకవర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కామెంట్స్ బాలయ్యా తారక్ ల మధ్య మరింత దూరాన్ని పెంచేలా ఉన్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. గతంలో బాలయ్యా జూనియర్ ల మధ్య గ్యాప్ విపరీతంగా ఉన్నప్పుడు తారక్ సినిమాలను తొక్కేయాలని బాలకృష్ణ అభిమానులలోని ఒకవర్గం చేసిన ప్రయత్నాలు జూనియర్ అప్పుడే మరిచిపోయడా అంటూ తారక్ అభిమానులలోని ఒక వర్గం జూనియర్ ను ప్రశ్నిస్తోంది. 
Balayya's wife Invited Junior NTR
అంతేకాదు గతంలో ఎన్టీఆర్‌ సినిమాలని బాయ్‌ కాట్‌ చేయాలంటూ జరిగిన ఎస్‌ఎంఎస్‌ క్యాంపైన్‌ ని గుర్తుకు చేస్తున్నారు తారక్ అభిమానులలోని ఒక వర్గం. బాబాయ్‌ అబ్బాయ్‌ సంబంధాలు మెరుగు పడినా అది వారి కుటుంబ విషయాలకే పరిమితం కావాలి కానీ సినిమాలలో కలిసి నటించడం ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం మరీ అతిగా ఉంటుందని జూనియర్ వీరాభిమానుల వితండ వాదన. 
Jr. NTR To Make Way For Balakrishna’s ‘Dictator’
ఇలాంటి పరిస్థుతులలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈకామెంట్స్ ను చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. అయితే కొందరు మాత్రం జూనియర్ బాలయ్యలు తిరిగి ఒకటిగా అవ్వడం ఇష్టం లేని కొన్ని వ్యతిరేక వర్గాలు ఇలా కావాలని జూనియర్ అభిమానుల పేరుతో ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని ఈవార్తలలో ఎలాంటి నిజాలు లేవనీ ఖండిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కలిసినట్లుగా కనిపిస్తున్న బాలకృష్ణ జూనియర్ ల సాన్నిహిత్యం పై ఇలాంటి విష ప్రచారంతో కూడిన కామెంట్స్ తిరిగి పరిస్థితిని మొదటి స్థాయికి తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదు అని  అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: