జూనియ‌ర్ ఎన్టీఆర్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ రామ‌య్యావ‌స్తావ‌య్యా పై అభిమానుల అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. రోటీన్‌కి భిన్నంగా ఎన్టీఆర్ ట్రెండి అండ్ కూల్ లుక్‌లో ద‌ర్శన‌మిచ్చాడు. గ‌బ్బర్‌సింగ్ మూవీతో ఓవ‌ర్‌నైట్ బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్‌గా మారిపోయిన హ‌రీష్‌శంక‌ర్, త‌న సెకండ్ ఫిల్మ్‌ని బ్లాక్ బ‌స్టర్‌గా చేసే ప‌నిలో ఉన్నాడు. మొద‌ట‌గా రామయ్యవ‌స్తావ‌య్యా ఫిల్మ్ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ చెప్పిన బుడ్డోడు డైలాగ్‌కి అంద‌రినోట నెగిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ అనేది ఎన్టీఆర్ మూవీల రొటీన్ స్టోరీలే, ఇందులో కొత్తేమి లేదంటూ తెగ ప్రచారం జ‌రిగింది. ఇప్పుడు ఆ టాక్ మారిపోయింది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన వీడియో సాంగ్ బిట్, సింప్లి కూల్ అంటున్నారు.

ఎప్పుడు డ్యాన్స్‌ల‌తో ఇర‌గ‌దీసే జూనియ‌ర్‌, ఈ పాట‌లో మెలోడి ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్‌ను కొత్తగా ఎలా చూడాలో ఈ సాంగ్‌ను చూసిన త‌రువాత అచ్చు అలాగే ఉన్నాడ‌నిపిస్తుంద‌ట అబిమానుల‌కి. యూవ నాయుకుడిగా ఎన్టీఆర్ ఈ మూవీలో క‌నిపించ‌నున్నాడు. ఈ త‌ర‌హా పాత్రల‌ను నాగ మూవీలో జూనియ‌ర్ చేసిన‌ప్పటికి, ఈ ఫిల్మ్ కంప్లీట్ డిప్రెంట్ అంటున్నాడు డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్‌. త్వర‌లో రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ ఆడియో వేడుకుకు సిద్ధమ‌వుతుంది. ఎట్ ప్రెజెంట్ రెండు పాట‌ల‌క షూటింగ్ కోసం ఈ యూనిట్ ఫారిన్ చెక్కేసింది. సెప్టంబ‌ర్ 27 మూవీ రిలీజ్ అంటున్నా, ఆ డేట్ మారే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్నాయంటుంది టాలీవుడ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: