రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో తన లేటెస్ట్ మూవీ అవుట్ డోర్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లేముందు ‘సైరా’ టీమ్ కు పెద్ద క్లాస్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఈమూవీకి సంబంధించి చిరంజీవి పుట్టినరోజునాడు విడుదలైన టీజర్ అని అంటున్నారు. 
megastar chiranjeevi starrer sye raa narasimha reddy teaser released
ఈటీజర్ కు మొదటిరోజున 10 మిలియన్ వ్యూస్ మార్కుకు అతి చెరువుగా వెళ్ళినా ఈవిషయం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ గా నమోదు కాకపోవడం చరణ్ ను ఆశ్చర్య పరిచినట్లు టాక్. వాస్తవానికి ఒక మూవీ టీజర్ కు 5,6 మిలియన్ల వ్యూస్ వస్తే చాలు టాప్ ట్రెండింగ్ అంటూ పోస్టర్లు వేసుకునే పబ్లిసిటీ ట్రెండ్ లో ‘సైరా’ టీజర్ ట్రెండింగ్ కు సంబంధించిన ప్రచారం సరిగ్గా జరగకపోవడం చరణ్ కు విపరీతమైన అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ ప్రమోషన్ కోసం చరణ్ ముచ్చటపడి ముంబాయ్ నుండి తీసుకువచ్చిన పబ్లిసిటీ టీమ్ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల యుట్యూబ్ హిట్స్ తక్కువగా రావడంతో చరణ్ కాస్త అప్ సెట్ అయ్యాడని మెగా కాంపౌండ్ టాక్. వాస్తవానికి ఈటీజర్ కు ‘బాహుబలి’ టీజర్ కు మించి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుందని చరణ్ భావించినా ఆప్లాన్ రివర్స్ అవ్వడం చరణ్ కు అసహనం కలిగించడంతో చరణ్ విదేశాలకు వెళ్ళేముందు ‘సైరా’ ప్రమోషన్ టీమ్ కు చాలగట్టి క్లాస్ పీకాడని వార్తలు వస్తున్నాయి.
సుదీప.. సూపర్ గా..
ఇది ఇలా ఉండగా ‘సైరా’ మూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేయబడుతున్న ఆపాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్ విషయంలో వస్తున్న విమర్శలు కూడ చరణ్ కు అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఈమూవీకి సంబంధించిన పాత్రల గెటప్ లు ఒక ఫిక్షన్ సినిమా గెటప్ లుగా ఉన్నాయి తప్ప నేచురల్ గా లేవు అని వస్తున్న కామెంట్స్ చరణ్ అసహనానికి కారణం అని అంటున్నారు. అయితే ఈమూవీ కథ 18వ శతాబ్దానికి చెందినది కాబట్టి అప్పటి వేషభాషలు విషయంలో సరైన చారిత్రిక ఆధారాలు లేకపోవడంతో ఇలా ఒక ఊహా జనితమైన గెటప్స్ డిజైనింగ్ ‘సైరా పాత్రల విషయంలో జరిగి ఉండవచ్చు అని కొందరి భావన.. 


మరింత సమాచారం తెలుసుకోండి: