చిరంజేవి నటిస్తున్న సైరా సినిమా ఇప్పటికే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మూవీ మొన్న రిలీజ్ అయినా టీజర్ కు మంచి స్పందనే లభించింది. అయితే సైరా సినిమా వాస్తవ సినిమా కంటే కాల్పనికత గానే చిత్రీకరిస్తున్నారు.  బాహుబలి సినిమా అన్నది ఫిక్షన్ కాబట్టి ఎలాంటి గెటప్ లు ప్లాన్ చేసినా నడచిపోతుంది. అది ఇండియన్ ఆర్కిటెక్చరా? మరోటా, ఇవన్నీ అక్కడ డిస్కషన్ కు రావు.

Image result for sairaa

అదే ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులతో వాస్కోడీగామా కథ నేపథ్యంలో ఉరిమి సినిమా మళయాళంలో తీస్తే, ఆ గెటప్ లు అన్నీ అప్పటివే పక్కాగా వుండేలా చూసుకున్నారు. ఇప్పుడు సైరా సినిమా మాత్రం గెటప్ ల విషయంలో కాస్త ఎక్కువ లిబర్టీనే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాయలసీమలో కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన కథ ఆధారంగా సైరా సినిమా తీస్తున్నారు. కానీ చిరంజీవి, అమితాబ్, లేటెస్ట్ గా బయటకు వచ్చిన సుదీప గెటప్ లు చూస్తుంటే ఓ ఫిక్షన్ సినిమా గెటప్ లు మాదిరిగా వున్నాయి తప్ప, నాచురల్ గా అయితే కాదు.

Image result for sairaa

భారీ సినిమా, చిరంజీవి అభిమానులను కూడా దృష్టిలో వుంచుకుని తీస్తున్న సినిమా, బాహుబలి విజయాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సినిమా కనుక ఈ గెటప్ లు ప్లాన్ చేసారు అని చెబితే ఓకె అని అనుకోవాల్సిందే. సుదీప గెటప్ చూస్తుంటే, రాయలసీమ, వందల ఏళ్ల క్రితం, అవుకు రాజు పాత్ర, పైగా తెలుగుతనం మచ్చుకైనా లేని ఆ గెటప్ ఏమిటా? అనిపిస్తుంది. అలా కాకుండా ఓ తొలితరం వీరుడి కథ, అది కూడా రాయలసీమ నేఫథ్యంలో చెబుతున్న కథ అనుకుంటే, గెటప్ లు మరీ ఎక్కువ కాకపోయినా, సహజత్వానికి దగ్గరగా వుండేలా చూస్తే మరింత కథకు న్యాయం చేసినట్లు అవుతుందేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: