తెలుగు ఇండస్ట్రీలో కామెడీ హీరోలు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ ల తర్వాత ఆ స్థాయిలో తమదైన కామెడీ మార్క్ చాటుతూ ఆ హీరోల లోపాలను పూడ్చారు అల్లరి నరేష్, సునీల్.  అయితే ఈ ఇద్దరు హీరోలకు కొంత కాలంగా అస్సలు కలిసి రావడం లేదు.  దాంతో సునీల్ ప్రస్తుతం హీరోగా కాకుండా తిరిగి కమెడియన్ గా నటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ కూడా మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.  తాజాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం ‘సిల్లీఫెలోస్’.

సుడిగాడు దర్శకులు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ లెన్త్ కామెడీ ఎంట్రటైన్ మెంట్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్ర ప్రమోషన్ వర్క్ మొదలైంది.  ఇప్పటికే ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాగా..ఈ మద్య ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.  తాజాగా  ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఇది ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. శ్రీ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించారు. 

భీమినేని శ్రీనివాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. . హీరోయిజంతో పాటు కామెడీని కలగలిపి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమా పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

చిత్రంలో కథానాయికలుగా పూర్ణ, చిత్ర శుక్లా, నందిని రాయ్‌లు న‌టిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  గతంలో అల్లరి నరేశ్ .. సునీల్ కాంబినేషన్లో 'తొట్టి గ్యాంగ్' సినిమా వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: