ఆ మద్య తెలుగు లో ‘రెమో’ చిత్రంతో అందరినీ అలరించిన హీరో శివకార్తికేయన్.   మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ని తన ప్రేమలో పడేసుకోవడానికి అమ్మాయిగా నటించిన శివకార్తికేయన్ నిజంగా అందాల బొమ్మలా కనిపించాడు.  ఈ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న శివకార్తికేయన్ మరో ఎంట్రటైన్ మెంట్ చిత్రంలో నటించాడు. 

సీమరాజా' పేరిట తమిళంలో శివకార్తికేయన్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సమంత పల్లెటూరి పిల్లగా కనిపిస్తుండగా, శివకార్తికేయన్ మాస్ లుక్‌ లో అదరగొడుతున్నాడు.

ట్రైలర్ లో సమంతను శివ ఎత్తుకునే ఓ సీన్ ఉండగా, దాని స్క్రీన్ షాట్, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  సమంతతో పాటు సిమ్రాన్, నెపోలియన్ తదితరులు నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా విడుదలకానుంది. అయితే ఈ చిత్రంలో సిమ్రాన్ విలన్ పాత్రలో నటిస్గున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: