ఈ రోజు  కృష్ణాష్టమి..వైష్ణవ దేవాలయాలు కిట కిటలాడుతున్నాయి.  ఈ సందర్భంగా చాలా మంది ఇళ్లల్లో చిన్న పిల్లలను చిన్ని కృష్ణుల వేషం వేయించి ఎంతో ఆనంద పడుతుంటారు.  అమ్మాయిలను గోపికల్లా అలంకరించి ఆనందిస్తారు.  ఇక తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు..తన స్నేహితురాలు స్నేహారెడ్డిని ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ జంటలకు ఇద్దరు పిల్లలు అబ్బాయి అయాన్..అమ్మాయి ఆద్య.  ఇక ఏ ఈవెంట్ వచ్చిన తన కొడుకును ఆ ఈవెంట్ కి తగ్గట్టు ముస్తాబు చేసి సోషల్ మీడియాలో ఫోటోలు అప్ లోడ్ చేస్తుంటాడు అల్లు అర్జున్.  తాజాగా నేడు కృష్ణాష్టమి వేడుకలు సర్వత్రా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లోనూ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి.
Related image
బన్నీ కుమారుడు అయాన్.. కృష్ణుడి వేషంలోనూ... ఆద్య.. గోపిక వేషంలోనూ అందంగా ముస్తాబై టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయారు. అయాన్ ఎల్లో కలర్ డ్రస్‌తో.. పిల్లనగ్రోవితో ఉంటే.. ఆద్య మిర్రర్ వర్క్ చేసిన డ్రెస్‌తో చేతిలో వెన్న కుండతో అచ్చం గోపికలా ముస్తాబైంది.  ముద్దులొలికేలా ఈ చిన్నారుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: