ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ దృష్టి అంతా విజయ్ దేవరకొండ పైనే కొనసాగుతోంది. అయితే విజయ్ మాత్రం డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకు అదృష్టం పై నమ్మకం లేదని మంచి కథను ఎంచుకోవడమే అదృష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఈ యాంగ్ హీరో రేంజ్ 10కోట్లకు చేరిపోయినా ఇతడి డేట్స్ కోసం ఆరాట పడే దర్శకుల లిస్టులో పూరి జగన్నాథ్ చేరిపోవడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Puri Jagannath shocking comments
గతంలో టాప్ హీరోలతో పనిచేసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న పూరీ జగన్నాథ్ పరాజయాల బాట పట్టడమే కాకుండా లేటెస్ట్ గా పూరి తన కొడుకు ఆకాష్ ను హీరోగా చేయాలని ‘మెహబూబా’ మూవీ ద్వారా చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలం కావడంతో ప్రస్తుతం పూరి తీవ్ర ఆర్ధిక సమస్యలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పూరి లేటెస్ట్ గా రిజిస్టర్ చేసిన ‘వాస్కో డగామా’ టైటిల్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 
Vijay Devarakonda
ఈ టైటిల్ ను విజయ్ దేవరకొండ కోసం పూరి రిజిస్టర్ చేసాడనీ ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఒక స్టోరీ లైన్ ను విజయ్ దేవరకొండకు చెప్పాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పూరీ తన గురువు రామ్ గోపాల్ వర్మ ద్వారా విజయ్ దేవరకొండ తన సినిమాలో నటించే విధంగా పూరి వ్యూహాత్మక ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 
Vijay Devarakonda The First Megastar of Telangana - Director Ram Gopal Varma
గతంలో రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది అన్న ప్రచారం జరిగింది. అయితే ఆతరువాత రకరకాల కారణాల వల్ల ఆమూవీ షూటింగ్ వరకు రాలేదు. దీనితో వర్మ శిష్యుడు పూరి స్కెచ్ లో విజయ్ నిజంగా పడితే అది పరోక్షంగా రామ్ గోపాల్ వర్మ నైతిక విజయం అనుకోవాలి. అయితే ప్రస్తుత పూరి స్థాయి ఒకప్పటిలా లేదు కాబట్టి పూరీ చెప్పే కథలకు ఎంత వరకు విజయ్ బుట్టలో పడతాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: