‘యూటర్న్’ప్రమోషనల్ సాంగ్..స్టెప్పులతో అదరగొట్టిన సమంత!

ఈ సంవత్సరం నటి సమంత అక్కినేనికి గోల్డెన్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు హాట్రిక్ సక్సెస్తో దూసుకెళ్తున్న సమంత తాజాగా యూటర్న్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. 2016లో కన్నడలో వచ్చిన ‘యూటర్న్’కి ఇది రీమేక్. అక్కడ ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో, తెలుగులోకి రీమేక్ చేశారు. ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ .. భూమిక నటించారు.