టాలీవుడ్ లో వరుసగా వస్తున్న బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు రాజకీయ, సినీ నేపథ్యంలో మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ వస్తున్నంది.  ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.   హైదరాబాద్ లో అసెంబ్లీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటుంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి సంబందించిన కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. అసెంబ్లీ హాల్, ఇతర పరిసర ప్రాంతాలలో ఈ చిత్రీకరణ జరగనుంది. ఇందులో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ పాత్రను వారి కొడుకు కళ్యాణ్ రామ్ పోషిస్తున్నారు. 

NTR-Biopic

ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి  ఎన్టీఆర్ పాత్రలో రక రకాలు వేషాల్లో కనిపించబోతున్నాడు.  అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి, శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్, ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు నటించబోతున్నారు.  ఇతర పాత్రల్లో మరికొంద మందిని తీసుకునే విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేయలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: