ఈరోజుల్లో సినిమా నుండి మహానుభావుడు సినిమా వరకు మారుతి తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నాడు మారుతి. వారంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు నాగార్జున కొన్ని రిపేర్లు చెప్పాడని తెలుస్తుంది. మారుతి సినిమాలో ఎవరు వేలు పెట్టడం ఇంతవరకు జరుగలేదు.


కాని చైతుకి ఈ సినిమా ఎలాగైనా హిట్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పాడట. మారుతి సినిమాలో కరక్షన్స్ పెద్దగా ఉండకున్నా నాగార్జున తనకు తోచిన కొన్ని కరక్షన్స్ చెప్పాడట. ఇది సినిమా ఫలితం మీద కచ్చితంగా ప్రభావితం చూపించే అవకాశం ఉంది.


సెప్టెంబర్ 13న రిలీజ్ అవనున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో రమ్యకృష్ణ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. మొత్తానికి తనయుడికి హిట్ ఇచ్చే క్రమంలో నాగార్జున మారుతిని మార్చేశాడు.


మారుతి సినిమా అంటే కామెడీ ఎంటర్టైనర్స్ అని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. ఆవిధంగానే శైలజా రెడ్డి అల్లుడు కూడా వస్తున్నాడు. నానికి భలే భలే మగాడివ్యో, శర్వానంద్ కు మహానుభావుడు లానే చైతుకి శైలజా రెడ్డి అల్లుడు కూడా ఆ తరహా హిట్ కొట్టేస్తాడేమో చూడాలి. చైతు లుక్స్, కాన్ఫిడెన్స్ మాత్రం ఈ సినిమా అనుకున్న హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: