కేరళ వరదల నేపథ్యం లో టాలీవుడ్ హీరోలు చాలా మంది తమ వంతు సాయాన్ని ప్రకటించారు. అయితే అందరూ పాతిక లక్షల లోపే ప్రకటించారు. పాతిక లక్షలు చిన్న మొత్తం ఏమీకాదు. అయితే ఇదంతా జరిగి అప్పుడే వారాలు దాటిపోయింది. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు బాహుబలి, సాహో ప్రభాస్ డొనేషన్ వార్తల్లోకి వచ్చింది.

Image result for prabhas

కేరళ హీరోలు తెలుగు హీరో ప్రభాస్ ను చూసి నేర్చుకోవాలి, అతగాడు కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చాడు అంటూ, కేరళ పర్యాటక మంత్రి కామెంట్ చేయడంతో ఇది ఆరంభమైంది. మళయాల నటులు భారీ పారితోషికాలు తీసుకుంటున్నా, సరైన డొనేషన్లు ఇవ్వలేదని, ప్రభాస్ మళయాలంలో ఓ సినిమా కూడా చేయకపోయినా, కోటి రూపాయలు ఇచ్చాడని ఆయన అన్నారు.

Image result for prabhas

ఇది ఇంగ్లీష్ పత్రికల్లో ఈరోజు రావడంతో, తెలుగు వార్తా మాధ్యమాల్లోకి కూడా వచ్చేసింది. కానీ సమస్య ఏమిటంటే, జనాలకు గుర్తున్న వరకు ప్రభాస్ ఇచ్చిన డొనేషన్ పాతిక లక్షలు మాత్రమే. మరి ఈ కోటి లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో? చూస్తుంటే పాపం, బలవంతంగా మొహమాట పెట్టి ప్రభాస్ చేత కోటి  డొనేషన్ ఇప్పించేసేలా వుంది వ్యవహారం. మొత్తానికి ప్రభాస్ ఎంత డొనేట్ చేశాడో ప్రస్తుతానికి సస్పెన్సు గానే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: