టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ పాత్రలతో దుమ్మురేపుతున్నాడు.  అడవిలో అభిమన్యుడు సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన జగపతి బాబు మొదట్లో యాక్షన్ తరహా సినిమాల్లో నటించాడు.  ఆ తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు.  అయితే జగపతి బాబు హీరోగా ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయాడు.
Image result for jagapathi babu
అంతే కాదు ఆయన జీవితంలో కూడా ఎన్నో వొడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమాలో మంచి ఛాన్స్ వచ్చింది..అయితే అది విలన్ పాత్ర కావడంతో మొదట సంకోచించినా..తర్వాత కమిట్ అయ్యారట.  ఆ సినిమాతో జగపతిబాబు దశ తిరిగిపోయింది.  రీసెంట్ గా `రంగ‌స్థ‌లం`, `గూఢ‌చారి` వంటి ప‌లు సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించి మెప్పించారు. 
Image result for jagapathi babu
విలన్ గా యూటర్న్ తీసుకున్న జగపతిబాబు వరుసగా ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.  ఇప్పుడు తెలుగులోనే కాదు హిందీ, తిమిళ్, మళియళ భాషల్లో కూడా నటిస్తున్నాడు జగపతిబాబు. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీకి కూడా జ‌గ‌ప‌తి బాబు సిద్ధ‌మ‌వుతున్నారు. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్న సినిమా `తానాజీ`. చారిత్ర‌క నేప‌థ్యం క‌లిగిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా జగపతిబాబు కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: